పోలవరం జిల్లా కూనవరం మండలంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మాజీ ఎంపీ మిడియం బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జి.ఓ. నంబర్-3 అమలు, 1/70 చట్టం పరిరక్షణ, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పునరావాస ప్యాకేజీ అమలు వంటి అంశాలపై చర్చించారు.ఈ మూడు అంశాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా పరిగణించి, తప్పనిసరిగా అమలు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులను పరిరక్షించే చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
ఈ నెలలో రంపచోడవరం పర్యటనకు సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో, ఈ మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సమావేశంలో డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని, పోరాటానికి సిద్ధమవుతామని గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు.
Tag:




Total views : 212152