తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సాంస్కృతికంగా కించపరిచేలా అశ్లీల నృత్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వబోమని, కొత్త సంవత్సరం సందర్భంగా బైక్‌లు, కార్లను రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పి పరమేశ్వర రెడ్డి హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి 31-12-2023/01-01-2024 రాత్రి సమయంలో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్థలాలు, క్లబ్‌లు మరియు పబ్‌ల నిర్వాహకులకు జిల్లా యస్.పి పి.పరమేశ్వర రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చట్టం-2013 ప్రకారం మార్గదర్శకాలులను జారీ చేశారు. కొత్త ఆంగ్ల సంవత్సరం రోజు (అర్ధరాత్రి) 1.00 AM వరకు ఈవెంట్లు/ కార్యక్రమాలు నిర్వహించబోవు హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ స్థలాలు, క్లబ్‌లు మరియు పబ్‌ల నిర్వాహకులు ముందుగానే అనుమతి మంజూరు కోసం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు తిరుపతి జిల్లా, కి దరఖాస్తు చేసుకోవాలి. అనుమతి తీసుకోని యెడల చట్టరీత్యా చర్యలు తీసుకోనబడును. ఈవెంట్ నిర్వాహకులు బయటకు/ లోపలికి వచ్చే మార్గాలలో మరియు పార్కింగ్ ప్రాంతాలలో ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. నిర్వాహకులు & మేనేజ్మెంట్ వారు బాధ్యతగా వారు నిర్వహించబోవు కార్యక్రమాల వద్ద భద్రత అదుపులో ఉండేందుకు తగు సిబ్బందిని వారే నియమించుకోవాలి. కార్యక్రమంలో వేసే దుస్తులు, చేసే నృత్యాలు, మాట్లాడే విధానాలలో ఏటువంటి అశ్లీలత ఉండదని నిర్వాహకులు నిర్ధారించాలి. ఏ ప్రదర్శనలోనూ అశ్లీలత మరియు నగ్నత్వం ఉండకూడదు. నిర్వాహకులు DJ/స్పీకర్స్ యొక్క శబ్దంను 45 డిసిబెల్స్ ను మించరాదు, సదరు విషయాన్ని ముందుగా నిర్ధారించాలి. నిర్వాహకులు & మేనేజ్మెంట్ వారు కార్యక్రమ వేదిక వద్ద ఎటువంటి బాణసంచా పేలుడు పదార్ధాలు అనుమతించరాదు. సదరు విషయాన్ని కస్టమర్లకు ముందుగా హెచ్చరిస్తూ తెలియపరచాలి. వేదిక లోపల నిర్వాహకులు క్రమబద్ధతను నిర్వహిస్తూ ఎటువంటి గందరగోళం లేకుండా ఉంచాలి. ప్రజలు మరియు బార్లలో ప్రత్యేకముగా దంపతుల/ జంటల కోసం నిర్వహించే కార్యక్రమాలలో మైనర్లను అనుమతించకూడదు.
Police
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా 31 వ తేదీ రాత్రి 8.00 గంటల నుండి జనవరి 01 వ తేదీ ఉదయం వరకు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెం 4 మల్లంపేట్ – శంభీపూర్ ఎగ్జిట్ 5 దుండిగల్ మూసి వేస్తున్నామని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏ.సి.పి శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు సామాజిక బాధ్యత వహిస్తే రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని బాలానగర్ డివిజన్ ట్రాఫిక్ ఏసిపి అన్నారు. శుక్రవారం జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, వాహనదారులు రోడ్లపైకి వచ్చేటప్పుడు సామాజిక బాధ్యత పాటించాలని అలాగే నూతన సంవత్సర వేడుకల్లో యువత మద్యం సేవించి వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఒక వేళ మద్యం సేవించి, హెల్మెట్ లేకుండా, నియమ నిబంధనలు పాటించకపోతే వాహన దారల పై చట్టపరమైన, న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒకరు వాహనాలు అజాగ్రత్త నడిపితే, ఒకరు వల్ల ఇంకొకరి ప్రాణాలకు ముప్పు ఉండవచ్చని అన్నారు. ఓ వ్యక్తి ప్రమాదంలో మృతి చెందితే సదరు వ్యక్తి కుటుంబం రోడ్డుపై పడుతుందని, ఒకరి నిర్లక్ష్యంతో మరొకరు ఇబ్బందుల పాలవుతారని ఎసిపి చెప్పుకొచ్చారు. డిసెంబర్ 31 రోజున 12 బృందాలతో పటిష్ట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు ఎ.సి.పి మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు. అర్ధరాత్రి ఎవరైనా కేకులు కట్ చేసిన, టపాసులు/ బాణసంచా పేల్చిన, బైక్ ర్యాలీ లు చేసిన సి.సి కెమెరా ద్వారా వారిని కనుగొని కేసులు నమోదుచేస్తామని అన్నారు. సమావేశంలో జీడిమెట్ల ట్రాఫిక్ సి.ఐ వెంకట్ రెడ్డి, యస్. ఐ లు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
సింగరేణి ఎలక్షన్ లో INTUC పోలీస్ లకు మధ్య స్వాల్ప ఘర్షణ. సింగరేణి ఎలక్షన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ SRP 1 గని వద్ద పోలీస్ లకు INTUC కార్యకర్తలకు మధ్య స్వాల్ప ఘర్షణ, AITUC నాయకులను పోలింగ్ కేంద్రంలోకి అనుమతుంచి క్యాంపెయిన్ చేపిస్తున్నారని పోలీస్ లతో వాగ్వివాదానికి దిగిన INTUC కార్యకర్తలు.
నిన్న కాంచీపురంలో ఒక రైడర్‌ను ఆ ప్రాంతంలో నరికి చంపారు. ఈ హత్యకేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రఘు, అసన్ అలియాస్ కరుపు అసన్.. వారిద్దరూ కాంచీపురం కొత్త రైల్వే బ్రిడ్జి దగ్గర దాక్కున్న సమయంలో పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడి చేశారు. స్పెషల్ అసిస్టెంట్ పోలీస్ ఆఫీసర్ రామలింగం, కానిస్టేబుల్ శశికుమార్‌లపై దుండగులు కొడవళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కాల్పులు జరపడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
హైదరాబాదులోని బేగంపేట ప్రజాభవన్ బారికేడ్లను కారు ఢీకొన్న ఘటన మరో మలుపు తిరిగింది. ఈ ఉదంతం వెనకబోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహుల్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న అర్ధరాత్రి ఓ కారు ప్రజాభవన్ వద్ద ఉన్న బారికేడ్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్ అతివేగంతో కారు నడుపుతూ ప్రజాభవన్ వద్ద బారికేడ్లను బలంగా ఢీకొట్టాడు. ఘటన జరిగిన సమయంలో కారులో ముగ్గురు యువతులు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది పంజాగుట్ట పోలీసులకు సమాచారమిచ్చి సాహిల్‌తో పాటూ ముగ్గురు యువతులను అప్పగించారు. అయితే, బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు సాహిల్‌ను హోంగార్డుకు అప్పగించి డ్రంకన్ డ్రైవ్ పరీక్షకు పంపించారు. ఈ సమయంలో నిందితుడు తప్పించుకున్నాడు. అనంతరం, సాహిల్ దుబాయ్‌లో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆయన సూచనతో అనుచరులు సాహిల్‌ను తప్పించి వారి పనిమనిషి అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట ఠాణాకు తీసుకెళ్లారు. కారు తానే నడిపినట్టు అతడితో చెప్పించడంతో కేసు నమోదైంది. అయితే, ముగ్గురు యువతులను స్టేషన్‌కు రప్పించి వాంగ్మూలం తీసుకున్నప్పుడు కారు నడిపింది సాహిల్ అని వెలుగులోకొచ్చింది. ఈ క్రమంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావును కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. బారికేడ్లను ఢీకొన్న ఘటనలో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ప్రధాన నిందితుడని పశ్చిమ మండలం డీసీపీ తెలిపారు. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు పనిమనిషిని ఠాణాకు పాంపారన్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించాక అసలు విషయం బయటపడిందన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లాలో స్టూడెంట్స్ కదం తొక్కారు. గుంటూరులో జగన్ పై పర్యటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారు. సీఎంను కలవడానికి ర్యాలీ వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. సీఎం గో బ్యాక్ అంటూ విద్యార్థులు ర్యాలీలు చేశారు. నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
జగిత్యాల జిల్లాలో సాయిరాం నగర్ లో పక్క పక్కనే వున్న నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఇళ్లకు వేసి ఉన్న తాళాలు పగలగొట్టి మరి దుండగులు చోరీకి పాల్పడారు. అందులో ఓ దుకాణం ఉండటం కూడ ఉంది. ఇళ్లలో ఎవరు లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. దీని పై క్లూస్ టీం తో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
వరంగల్ పోలీసులకు దొంగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా శివనగర్ లోని తాళం వేసిన ఇంటిలో చొరబడిన దొంగలు ఏడు లక్షల నగదు తో పాటు 70 గ్రాముల బంగారాన్ని అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లో కూర్చొని అందినంత దోచుకున్నారని వారు తెలిపారు. పెద్ద మొత్తంలో నగదు వెండి బంగారు ఆభరణాలు అపహరణకు గురి కావడంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అధికారులను ఆదేశించారు. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నగదు బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల అలజడి మరింత పెరిగింది. ఇటీవల ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో దారుణానికి ఒడిగట్టారు. బారాముల్లాలోని ఓ మసీదులో రిటైర్డ్ పోలీసు అధికారి మహమ్మద్ షఫీ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కాశ్మీర్ జోన్ పోలీసులు ఇవాళ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే లోయలో ఆర్మీ, పోలీసులు, కేంద్ర పోలీస్ భద్రతా బలగాలు ఉగ్రవాదుల సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. కాగా, ఈ ఘటనతో అధికారులు మరింత పటిష్టంగా తనిఖీలు చేపట్టారు.
నంద్యాల జిల్లాలో వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. నంద్యాల హౌసింగ్ బోర్డు కాలనీలో 50 సంవత్సరాల వృద్ధురాలు గ్లాడిన్ నివాసముంటోంది. ఎప్పటి మాదిరిగానే ఉదయం పనిమనిషి గ్లాడిన్ ఇంటికి వెళ్లి ఎంతసేపు పిలిచినా పలక పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తలుపు పగులకొట్టి చూడగా, వృద్ధురాలు తలపై తీవ్రగాయాలతో చనిపోయి కనిపించింది. వెంటనే క్లూస్ టీం సాయంతో విచారణ చేపట్టారు. మృతురాలి ఇద్దరు కుమార్తెలకు వివాహమై హైదరాబాద్ లో ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా సంవత్సరం క్రితం వృద్ధురాలి భర్త మరణించారు. నిన్న రాత్రి 8 గంటల వరకు పనిమనిషి గ్లాడిన్ ఇంట్లోనే ఉన్నారు. మరి ఉదయం లోపు గ్లాడిన్ ను ఎవరు హత్యా చేశారనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.