రాగల రెండు మూడు రోజుల పాటు తెలంగాణలో చలితీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని వెల్లడించింది. అయితే మూడు రోజుల తర్వాత చలి తీవ్రత సాధారణ స్థితికి రావొచ్చునని పేర్కొంది. ఇక డిసెంబర్ చివరి వారం నుంచి చలి తీవ్రత మళ్లీ పెరుగుతుందని, చల్లని గాలులు వీస్తాయని హెచ్చరించింది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ వరకు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది. హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది. మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీలు నమోదవుతున్నట్లు పేర్కొంది. పగటి పూట సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉంటున్నట్లు పేర్కొంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు, అత్యల్పంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో 28 డిగ్రీలు నమోదవుతోంది.
political
తక్షణ మానవతావాద సాయం కోసం గాజాలో ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. హమాస్ చెరలో ఉన్న బందీలందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఈ తీర్మానంలో పొందుపరిచారు. అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, పాలస్తీనాతోపాటు అనేక దేశాలు స్పాన్సర్ చేసిన ఈ తీర్మానంపై మంగళవారం ఓటింగ్ జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. మరో 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ముసాయిదా తీర్మానంలో హమాస్‌ను ప్రస్తావించకపోవడంపై అమెరికా, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తప్పుబట్టాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో హేయమైన ఉగ్రవాద దాడులను ఖండించాలని, బందీల విడుదలను పేర్కొంటూ తీర్మానానికి సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. జనరల్ అసెంబ్లీ నుంచి వెలువడిన శక్తిమంతమైన సందేశం పరంగా ఇదొక చారిత్రాత్మకమైన రోజు అని ఐరాసలోని పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. కొత్త మంత్రులు ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు మించి ఉండదంటూ విపక్ష నేతలు విమర్శలకు దిగుతున్నారు. ముఖ్యంగా హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్ సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు పరామర్శించిన నేపథ్యంలో ఈ తరహా విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి ఓదార్పు ఇచ్చారని, దీనిపై కూడా కొంతమంది బీఆర్ఎస్ ముఖ్యు నేతలు వ్యతిరేక వ్యాఖ్యలు చెయ్యడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవీయ స్పందనకు రాజకీయాన్ని కలపడం నేటి బీఆర్ఎస్కు అవసరమేమో కానీ కాంగ్రెస్‌కు ప్రభుత్వానికి అవసరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం కూలుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రకటనలను కేసీఆర్ తప్పక ఖండించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
Read Also..
Read Also..
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది. తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డుతో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఏపీ రాజకియాలపై సీపీఐ నారాయణ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజగా చోటు చేసుకుంటున్న రాజకీయాలపై, వచ్చే ఎన్నికలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల ఫలితాలను ఏపీకి పాలిటిక్సు లింక్ చేస్తూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారయి. ఏపీలోనూ తెలంగాణ ఎన్నికల ఫలితాలే కాబోతున్నాయని, జగన్మోహనన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పొరు. ఎమ్మెల్యేలకు అవినీతికి పాల్పడమని చెప్పిందే జగనే అని ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ప్రయోజనం లేదు నారయణ ప్రశ్నించారు. వైసీపీలో ఇన్చార్జ్ లు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు సీఎం అభ్యర్థినే మార్చాలని ఎద్దేవా చేశారు.
పుంగనూరు మేలుపట్ల కు చెందిన లతీఫ్ (28) కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున ప్రతిరోజూ కూలి పనులుకు వెళ్లేవారు. రోజు మాదిరిగా ఉదయం స్థానికంగా రాయల్ పేట రోడ్డు లో రేకులు షెడ్ వేయుటకు వెళ్లినట్లు లతీఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రేకుల షెడ్ పనులు చేస్తున్న సమయంలో షెడ్ పై పోతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ప్రమాద వశాత్తు తగిలి కాలినట్లు స్థానికులు సమాచారం. హుటాహుటిన విద్యుత్ సరఫరా నిలిపివేసి అతన్ని పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రధమ చికిత్స వైద్యులు అందించారు. మెరుగైన వైద్యం కొరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకురావడం దారుణమని న్యాయవాది వంగర వెంకటాచార్యులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీ భూహక్కు చట్టం 27/2023ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదుల సంఘము ఆధ్వర్యంలో అఖిలపక్షం ధర్నా నిర్వహించింది. అనంతరం ఆర్ డీవో అచ్యుత్ అంబరీష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ భూ హక్కు చట్టం కబ్జాదారులకు వరంగా మారనున్నదన్నారు. ఇది ఒక చీకటి చట్టం అన్నారు. రెవెన్యూశాఖ పాదాల చెంతకు ప్రజల ఆస్తి హక్కులును ప్రభుత్వం పెట్టిందన్నారు. మన హక్కులు కూడా డబ్బు పెట్టి కొనుక్కొనే చట్టం అన్నారు. ఇప్పటికే రెవెన్యూశాఖ లో రెడ్ టేపిజం, లంచగొండితనం పెరిగి పోయిందన్నారు. అధికారులు ఉత్తర్వులు ఇస్తే జిల్లా, రాష్ట్ర ట్రిబ్యునల్ దానికే మద్దతు ఇస్తుందన్నారు. అధికారులు ఇచ్చిన తీర్పును హైకోర్టులో పెట్టాలి. ఇప్పటికే హైకోర్టులో పని భారం పెరిగి పోయిందన్నారు. ఈ చీకటి చట్టాన్ని రద్దు చేసే వరకు ప్రజలు అందరూ వ్యతిరేకించాలని కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో సోమాజిగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించనున్నారు. తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో కాలుజారి పడిన ఘటనలో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. ఈ క్రమంలో కేసీఆర్ తుంటి ఎముకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు కూడా ఇప్పటికే పరామర్శించారు.
Read Also..
Read Also..
జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను, ఇతర జనసేన నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా అంటూ ప్రశ్నించారు. తమ ధర్నా రాజకీయ కార్యక్రమం కాదని శాంతియుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమమని మనోహర్ చెప్పారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు, నాగ గాయత్రి తో గత నవంబరు 1న వివాహం జరిగింది. వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు. అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also..
Read Also..