Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు

సముద్రంలో స్నానానికి వెళ్లిన నవదంపతులు గల్లంతు

by Satya
newlyweds are lost

నెల రోజుల క్రితం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇంకా నవ దంపతుల కాళ్లపారాణి ఆరనే లేదు. నవదంపతులు విహారయాత్ర విషాదయాత్రగా మారింది. బీచ్‌లో సరదాగా గడిపేందుకు వెళ్లిన ఆజంట సముద్రంలో గల్లంతయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన రేలంగి లక్ష్మీనారాయణకు, నాగ గాయత్రి తో గత నవంబరు 1న వివాహం జరిగింది. వరుడు లక్ష్మీనారాయణ భీమవరంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మీనారాయణ తన సతీమణి నాగ గాయత్రితో కలిసి విహార యాత్రకు కోనసీమ జిల్లా అంతర్వేది వచ్చారు. అయితే బీచ్‌లో స్నానానికి దిగగా కెరటాల ఉద్ధృతికి సముద్రంలో మునిగి గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న ఇరుకుటుంబాల సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నదంపతుల ఆచూకీ కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: