మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా తాను కాంగ్రెస్ గెలుస్తుందని 50 లక్షలు పందెం కాశానని, కానీ తన కుమారుడు ప్రణీత్ రెడ్డి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడంతో ఆ పందెం రద్దు చేసుకున్నానని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని తనకు తెలిసి కూడా, కుమారుడు చెప్పడంతో పందెం విరమించుకున్నానని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు మద్దతు ఇస్తే కచ్చితంగా ఒంగోలు నుంచి బరిలో దిగుతానని, మద్దతు ఇవ్వనంటే అసలు పోటీయే చేయనని అన్నారు. తాను నీతిమంతుడ్ని అని, ఎక్కడా డబ్బులు తీసుకోలేదు అని చెప్పననీ. అయితే ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం ఎక్కడా తప్పు చేయలేదని, మంత్రిగా ఉన్నప్పుడు బయటి వాళ్లు ఇస్తే తీసుకున్నాను అనీ అన్నారు. డబ్బులు తీసుకోకుండా తాను రాజకీయాలు చేయలేనని అన్నారు.
political
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పరామర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం సోమాజిగూడలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. చినజీయర్ స్వామి ఆసుపత్రికి వెళ్ళి బీఆర్ఎస్ అధినేతను పరామర్శించారు. నిన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించింది. ఆ తర్వాత ఆయనను పలువురు నాయకులు ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ క్రమంలో చిన్నజీయర్ స్వామి మాజీ సీఎంను పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చిన్నజీయర్ స్వామి ఆకాక్షించారు. ఆ తర్వాత అక్కడే ఉన్న కేసీఆర్ కుటుంబ సభ్యులతో చిన్నజీయర్ స్వామి కొంతసేపు మాట్లాడారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ. బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రత్యేక్షంగా ఉన్న వారు చూస్తుండగానే బైక్ నుండి మంటలు వ్యాపించి క్షణాల్లోనే బూడిద అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలనికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైనా వ్యక్తి ఎవరు అనే కోణం లో పోలీస్ లు ధర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పూర్తిగా కాలిపోవడం తో వివరాలు తెలియరాలేదు. పోలీస్ లు ధర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు మంత్రి ఆర్కే రోజా కాకినాడ జిల్లా సామర్లకోటలోని కుమార భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని నన్నయ్య యూవర్శిటీలో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రోగ్రాంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి పాల్గొన్నారు. మంత్రి ఆర్కే రోజా నన్నయ్య వర్శిటీలో వివిధ ప్రాంతలా ఛాంపియన్ షిప్ విద్యార్థులకు గౌరవ వందనం చేశారు. నన్నయ్య వాణితో మంత్రిని అలరించారు యూనివర్సిటీ సిబ్బంది. ఇక, ఈ రోజు పాలకొల్లులోనూ మంత్రి రోజా పర్యటించనున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవంలో మంత్రి రోజా పాల్గొననున్నారు.
Read Also..
Read Also..
సింగరాయకొండలో పాతకక్షల నేపథ్యంలో యువకుడును గొంతు కోసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆడుతా ఆంధ్ర క్రికెట్ పోటీల్లో క్రీడలను చూడటానికి వచ్చిన మూలుగుంటపాడు గ్రామానికి చెందిన మిరియం శ్రీకాంత్ యువకుడు ను, ఊళ్లపాలెం కు చెందిన కొల్ల సాయి అను యువకుడు మద్యం తాగి కత్తితో మెడకోసిన సంఘటన జరగడంతో ఒక్కసారిగా ప్రాంగణమంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటన పాత కక్షల నేపథ్యంలోనే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రుని ఒంగోలు రిమ్స్ కు తరలించగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో గిరిజనుల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. తుపాను వల్ల సర్వం కోల్పోయామని గిరిజనులు చంద్రబాబు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని తెలిపారు. కాలనీలో రహదారి లేక రోజుల తరబడి బురదలోనే తిరిగామని వాపోయారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని చంద్రబాబుకు వివరించారు. వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ ఎస్టీ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.అంతేకాదు, టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని వెల్లడించారు. తుపాను బాధితులకు ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
బాక్సర్ నిఖత్ జరీన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలలో భాగంగా ఈ రోజు రెండు పథకాలను అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. చేయూత, మహాలక్ష్మి పథకాలను లాంచ్ చేశారు. ఈ సమయంలోనే జరీన్‌కు ఆర్థిక సాయం అందించారు. గత మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో 50 కిలోల విభాగంలో జరీన్ స్వర్ణపతకాన్ని గెలుచుకుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలలో ఆమెకు ఇది రెండో బంగారు పతకం.
Read Also..
Read Also..
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను లాంఛనంగా ప్రారంభించింది. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ప్రయాణించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే పథకం ప్రారంభం అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు బస్సులో ప్రయాణించే సమయంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. భారీ కాన్వాయ్‌తో బస్సులు ముందుకు కదిలాయి. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ రూపం కనిపిస్తుందని, నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని మనకు సోనియా గాంధీ ఇచ్చారన్నారు సోనియా గాంధీ. ప్రజల కోసమే సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని, ఇందులో భాగంగా ఈ రోజు రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. మహిళలకు ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు.
హైదరాబాద్ లోని అసెంబ్లీలో శనివారం జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి కార్మికుడిగా దుస్తులు ధరించి, తలకు హెల్మెట్, తట్ట చెమ్మస్ తో అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ తో మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని వారికి రక్షణగా ఉంటానని అన్నారు. రామగుండం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు హామీలను అమలు చేసామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కేసీఆర్ పేరు మీద అర్చకులు అభిషేకం చేశారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ తో పాటు ఆలయ ధర్మకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.