భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచ న్యూఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో 72వ పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 22.08 శాతం పోలింగ్ జరిగిందని గతంలో లో కన్న ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది అని అన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటలకి ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తేరారని అన్నారు. అంతేకాకుండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7గంటల నుండి నాలుగు గంటల వరకే పోలింగ్ కు జరిగే నేపథ్యంలో ఓటర్లందరూ నాలుగు గంటలలోపు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.
Polling
వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చురుకుగా సాగుతోందన్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు శాంతికుమారి వివరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్లో కవిత తన ఓటును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోడ్ ఉల్లంఘించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కవిత వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్ దృష్టికి తెచ్చి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ వేళ మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంకు 25 మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని మావోయిస్టులు హెచ్చరించి వదలిపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లికి చెందిన వ్యాపారులుగా గుర్తించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని నేడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు జిల్లా లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ప్రక్రియ కు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసే సమయంలో సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగటం అవి ఇతరులకు చూపించడం చట్ట ప్రకారం నేరమని ఒకవేళ అలా చేస్తే ఎన్నికల నిబంధన 49 ఎం ప్రకారం ఎన్నికల అధికారులు గుర్తించి ఓటర్ను బయటకు పంపిస్తారు. ఆ ఓటును 17 ఏ రిజిస్టర్లో నమోదు చేసి లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకోరు అంతేకాకుండా అలా చేసిన వారు శిక్షార్హులు అవుతారు అని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రియాంక అల జిల్లా ఎస్పీ వినోద్ జి ఓటర్లను కోరారు.
నేలపై ముగ్గుల వేసిన పోలింగ్ బూతు నెంబర్లు చెరిగిపోవడంతో.. ఓటర్లు తమ పోలింగ్ బూత్ లను తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు. పోలింగ్ బూత్ నెంబర్లను సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నేలపై ముగ్గుగా వేసి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. పోలింగ్ స్టేషన్లో వద్ద వంద మీటర్ల లోపు ఆంక్షలు అమలులో విఫలమవడంతో.. కొందరు రాజకీయ నాయకులు 100 మీటర్లు పైబడి చొచ్చుకువచ్చి వచ్చి తమ పార్టీ గుర్తులు ఓటర్లకు చెబుతూ ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఓటు వేసే ఈవీఎం క్యాబిన్ వద్ద చీకటిగా ఉండడంతో గుర్తులు కనబడక ఓటర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు.
Read Also..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ BRS అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి పార్టీ కండువాతో వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎల్లపల్లి గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌కు కండువాతో వెళ్లడం ఏంటని, ఇది ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని. విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
పినపాక నియోజకవర్గం మణుగూరులో సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై మానవ రహిత వైమానిక వాహనంతో ఈ సారి పోలీసు వ్యవస్థ గట్టి నిఘా ను ఏర్పాటు చేసింది.. వైమానిక వాహనంతో 17 కిలోమీటర్ల దూరంలో ఏరియల్ చాయ చిత్రాలు అందించడం దీని ప్రత్యేకత.. ఈ వైమానిక విమానంతో నదులు, అడవులు, గ్రామాలు ఎక్కడైనా పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటు చేసుకున్న ఈ వాహనంతో పర్యవేక్షించవచ్చు.
Read Also..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజక వర్గాల్లో 276 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 3781 పోలింగ్ కేంద్రాలు…18000 మంది పోలింగ్ విధుల్లో వున్నారు. ఉమ్మడి జిల్లాలో 1200 సమ్యస్యత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపు.. 20 వేల మంది తో పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేశారు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 29,01,435 మంది ఓటర్లు మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. అత్యధికంగా మునుగోడులో 39 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, అత్యల్పంగా దేవరకొండలో 13 మంది పోటీలో ఉన్నారు. నల్గొండలో 1768 పోలింగ్ కేంద్రాలు… సూర్యాపేట జిల్లాలో 1201 పోలింగ్ కేంద్రాలు.. యాదాద్రి 812 పోలింగ్ కేంద్రాలు… ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది..
Read Also..
రేపు పోలింగ్ జరిగే ఎన్నికల సిబ్బందికి ఈ రోజు ఎన్నికల సామగ్రిని అందించడం జరిగింది, ఎన్నికలు జరిగే పోలింగ్ స్టేషన్లకి ఈవీఎం మిషిన్లతో పాటు ఎన్నికల సిబ్బంది కూడా చేరుకోవడం జరుగుతుంది, మన గజ్వెల్ నియోజకవర్గంలో 321 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఎన్నికల పోలింగ్ స్టేషనులను చూసుకోవడానికి 321 మంది ప్రొసీడింగ్ ఆఫీసర్లు అలాగే అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగింది 642 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేసాము, 202 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించాము అందులో లైవ్ వెబ్ పోస్టింగ్ 124 మైక్రో అబ్జర్వర్ లను ఏర్పాటు చేసాము, పోలింగ్ స్టేషన్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు, పోలింగ్ స్టేషన్లో ఓటర్ సహాయక కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాము, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వన్ ప్లస్ వన్ అలాగే 800 నుండి 900 మంది పోలీసు సిబ్బందిని మొత్తంగా ఏర్పాటు చేసాము.