కాంగ్రెస్ పార్టీ రెండో విడత బస్సు యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో రెండో విడత బస్సు యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు తెలిపారు. రెండో విడత బస్సు యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. రేపు డీకే శివకుమార్, ఎల్లుండి ఖర్గే పాల్గొననున్నారు. మొదటి రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండో రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో, మూడో రోజు భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో, నాలుగో రోజు నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని నాగార్జున సాగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో, ఐదో రోజు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో, ఆరో రోజు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరగనుంది.
Rahul Gandhi
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని సెటైర్ వేశారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారం చేసిన ఘనత రాహుల్ గాంధీదేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు దోచుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదన వింతగా ఉందని మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయన్నారు. అసోం, రాజస్థాన్, మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు.






Total views : 90741