కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని.. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్యపూర్వక వాతావరణం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని.. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్ర సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించింనందుకు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Revanth Reddy
ఆదిలాబాద్ జిల్లా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)
ప్రధాని మోదీ సభలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకున్నారు. సీఎంకు మంత్రి సీతక్క, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి మోదీ రానుండగా సీఎం కూడా వెళ్లనున్నారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు రాష్ట్ర కీలక నేతలు ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా 2024 సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రానున్న రోజుల్లో హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్‌కు రాజధానిగా చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో మూడు చోట్ల ఫార్మా విలేజ్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్-2ని కూడా ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. ఇప్పటికే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో పాల్గొని రాష్ట్రానికి 40 వేల కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇది చదవండి: తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 500లకు సిలిండర్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నగదు బదిలీ:
మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని తెలంగాణా పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన రేవంత్ సర్కార్ మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది.
పేపర్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం..!
తాజా నిర్ణయానికి సంబంధించిన విధివిధానాల్ని పౌరసరఫరాల శాఖ రూపొందించింది. అయితే కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం వర్తించదు. పాత కనెక్షన్లలో ఆహారభద్రత కార్డులున్నవారికీ.. అది కూడా వాడకంలో ఉన్న సిలిండర్లకే గ్యాస్ సబ్సిడీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు. గృహ వినియోగదారుడు గడిచిన మూడేళ్లలో వాడిన సిలిండర్ల సగటు ఆధారంగా రాయితీ సిలిండర్ల సంఖ్య ఖరారు చేస్తారు. ప్రస్తుతానికి దాదాపు 40 లక్షల మహిళా లబ్ధిదారుల గుర్తించామని అధికారులు తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Ranga Reddy District :
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో ఈనెల 27 తేదీన జరగబోవు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ యొక్క ముఖ్యమంత్రి సభకు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా రానున్నారు. ఈ నేపథ్యంలో సీపీ అవినాష్ మహంతి సందర్శించి సభ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమి నిర్వహించాలనే విషయాలపై సూచనలు చేయడం జరిగింది. అలాగే పార్కింగ్ కానీ రూట్ మ్యాపింగ్ నిర్వహణ, పూర్తి సభ సమగ్ర విచారణ విషయాలపై ఆయన అరా తీశారు. ఈ సమావేశం పై సూచనలు చేశారు ఈ యొక్క కార్యక్రమంలో రాజేంద్రనగర్ డిసిపి సిహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసిపి కిషన్, సిఐ లక్ష్మారెడ్డి మరియు రెవెన్యూ అధికారులు పోలీసు బృందం పాల్గొన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas):
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాపాలన కావాలని-రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టంగట్టారని అన్నారు. 70 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయహస్తం ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు, ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. Read Also..
Follow us on : Facebook, Instagram & YouTube.
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..by CVR NEWSజిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..by CVR NEWSరాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
- చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…by CVR NEWSఅమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Medigadda:
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ (Medigadda) లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు ఈ బృందం రానుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 40 బస్సుల్లో మేడిగడ్డకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజీ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.
అలాగే బ్యారేజీ వంతెనపై కుంగిన పిల్లర్ మీదుగా మహారాష్ట్ర వైపు నుంచి గోదావరి నదిలో పగుళ్లు తేలిన పిల్లర్ల వద్దకు రేవంత్ రెడ్డి బృందం వెళ్లనుండగా అక్కడ సైతం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా బ్లాక్-7లోని 20వ పిల్లర్ ను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశం ఉండటంతో ఆ ప్రదేశంలో ఊటల ద్వారా వస్తున్న నీటిని డీవాటరింగ్ చేస్తున్నారు. కుంగిన ప్రాంతంలో కాంక్రీటు పగుళ్లు తేలడంతో గోదావరి ప్రవాహాన్ని మరల్చేందుకు ఏర్పాటు చేసి మట్టి కట్టల ద్వారా ఊటలు ఉబికివస్తున్నాయి. దీంతో పెద్ద మోటార్లను ఏర్పాటు చేసి నీటిని తొలగిస్తున్నారు. కుదురుపల్లి నుంచి మహదేవపూర్ మండల కేంద్రం, ఎల్అండ్ టి రోడ్డు మీదుగా నేరుగా మేడిగడ్డ బ్యారేజీకి ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకోనున్నారు. తిరిగి అదే మార్గంలో హైదరబాద్ కు వెళ్లనున్నారు.
హైదరాబాద్ నుంచి ఏసీ బస్సుల్లో ఉదయం 10:15 కు బయల్దేరనున్న ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకోన్నారు. బ్యారేజీ వద్ద పరిశీలన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే తిరిగి హైదరబాద్ కు బస్సుల్లో బయల్దేరనున్నారు. ముఖ్యమంత్రి మాత్రం మేడిగడ్డ (Medigadda) నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హైదరబాద్ కు వెళ్లే అవకాశం ఉంది
మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు సీఎం రేవంత్, ప్రజాప్రతినిధులు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బస్సుల్లో వస్తున్నందున పోలీస్, ఇంటెలిజెన్స్ బృందాలు భద్రతా చర్యలను ముమ్మరం చేశాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో భూపాలపల్లి నుంచి పంకెన, పలిమెల వరకు భారీగా బలగాలను మోహరించారు. గ్రేహౌండ్స్ బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. Read Also..
మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కొందరు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ముఖ్యమంత్రితో సమావేశం కాగా, తాజాగా ఆ జాబితాలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న రామ్మోహన్, ఇదే విషయమై రేవంత్‌ను కలిసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరికొంత మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఒకట్రెండురోజుల్లో సీఎం కలిసే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. Read Also..
ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సమర్పించారు. మేడారం జాతరకు బంగారం సమర్పించేందుకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ సేవలను దేవదాయ శాఖ అందుబాటులోకి తెచ్చింది. మేడారానికి వెళ్లలేని భక్తులు సమ్మక్క సారక్కలకు బంగారంగా భావించే బెల్లం సమర్పించే అవకాశంతో పాటు ప్రసాదం తెప్పించుకునే సదుపాయాన్ని రాష్ట్రప్రభుత్వం కల్పించింది. మీసేవ, పోస్టాఫీసులతో పాటు ‘టీ-యాప్ ఫోలియో’ యాప్ ద్వారా సేవలు పొందేలా ఏర్పాటు చేశారు. Read Also..
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వీధి రౌడీలా మాట్లాడుతున్న బాల్క సుమన్ ను వెంటనే అరెస్టు చేయాలని మాజీ ప్రభుత్వ విప్, కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు పేర్కొన్నారు. ఓదెల నివాసం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే అతని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని చెప్పుతో కొడతానంటు చెప్పు చూపెట్టడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని, సుమన్ ఓడిపోయిన ఒత్తిడిలో ఉన్నాడని వెంటనే అతన్ని పిచ్చాసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సుమన్ ఈ నియోజకవర్గ ప్రజలు దగ్గరికి కూడా రానివ్వరని, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పదేళ్లు పాలించి వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కూడా పెట్టుకున్నారని మండిపడ్డారు. మొదటిసారి పెద్దపెల్లి పార్లమెంట్ లో పోటీ చేసినప్పుడు తనకు ఏమీ లేవా అని పేదవాన్ని ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచి ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడని మండిపడ్డారు. సుమన్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని చెన్నూరు నియోజకవర్గ ప్రజలు మంచిర్యాల జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో చెప్పులతో తరిమి తరిమి కొడతారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన 102 హామీలలో ఎన్ని నెరవేర్చాడు చెప్పాలని విమర్శించారు. దళిత బంధు దళితులకు మూడు ఎకరాలు వంటి ఎన్నో హామీలను విస్మరించినందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పి ఓడ కొట్టారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి పై సుమన్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, మహిళ పట్టణ అధ్యక్షురాలు గడ్డం రజిని, మహిళా నాయకురాలు సమత, సరిత పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.






Total views : 90138