ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్‌ను మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీల్లో నూటికి 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియలో దీనిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనలు-1996 ప్రకారం మహిళలకు ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరిల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధన ఉంది.
Shantikumari
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో రేవంత్ రెడ్డి అనే నేను..అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. నాయకత్వ లేమి పార్టీకి ఇబ్బందిగా మారి, 2014, 18 ఎన్నికల్లో చతికిలపడింది. ఈ కష్టకాలంలో రేవంత్ ఎంట్రీ ఆ పార్టీకి ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఇటు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న అధిష్టానం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంది. సీనియర్ నేతలు ఏకతాడిపైకి రావడం, రేవంత్ మాస్ లీడర్ షిప్ ను గెలుపు తీరాలకు చేర్చి కాంగ్రెస్ పదేశ్ల నిరీక్షణకు తెరదించారు.
ఎల్ బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. L.B. స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదే విధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో రేవంత్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి దీనావస్థకు చేరింది. నాయకత్వ లేమి పార్టీకి ఇబ్బందిగా మారింది. 2014, 18 ఎన్నికల్లో చతికిలపడింది. ఈ కష్టకాలంలో రేవంత్ ఎంట్రీ ఆ పార్టీకి ఊపు తెచ్చిందనే చెప్పాలి. ఇటు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న అధిష్టానం ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంది. సీనియర్ నేతల ఏకతాడిపైకి రావడం, రేవంత్ మాస్ లీడర్ షిప్ గెలుపు తీరాలకు చేర్చి కాంగ్రెస్ పదేశ్ల నిరీక్షణకు తెరదించారు. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించి సమీక్షించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సి.ఎస్ కోరారు. ప్రమాణస్వీకారానికి వచ్చే వారికి తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు. అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక శకటాలను వేదిక వద్ద ఉంచాలి. వేదికను శుభ్రపరచడం, త్రాగు నీరు ఫాగింగ్ చేయడం వంటివి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. L.B. స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. అదే విధంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ అధికారులకు ఆదేశించారు.
Read Also..
Read Also..
వయోజనులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ చురుకుగా సాగుతోందన్నారు. హైదరాబాద్ జూబిలీ హిల్స్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికలాంగులకు ప్రత్యేక వసతులు కల్పించినట్లు శాంతికుమారి వివరించారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు.





Total views : 200944