సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్ కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. శ్రీ చైతన్య స్కూల్ పై వరుస కథనాలు ప్రసారం చేయడంతో అధికారులు రియాక్టయ్యారు. ఇంతకు ముందే ఒకసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు రెండో సారి షోకాజ్ నోటీసులు చేశారు. తీరు మార్చుకోకుంటే స్కూల్ సీజ్ చేస్తామని విద్యాశాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. శ్రీ చైతన్యకు అనుమతులు లేనప్పుడు ఇన్ని రోజులు అధికారులు ఏం చేశారని తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య పేరుతో, విద్యార్థుల తల్లి దండ్రుల దగ్గర కట్టించుకున్న అధిక ఫీజులు తిరిగి ఇస్తారా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. సదాశివపేట లో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య స్కూల్, శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం అంటు అధిక ఫీజులు వసూళ్లు చేయడంపై మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బుక్స్, యూనిఫామ్స్ డబ్బులు కూడా స్కూల్ లోనే విక్రయించారని ఆరోపిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య స్కూల్ …విద్యాశాఖ అధికారులకు కనిపించక పోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతోనే శ్రీ చైతన్య యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేసిందని విమర్శించారు. ఇక స్కూల్ లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా.. అసలు బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన ఉపాధ్యాలు నిజంగానే ఉన్నారా.. లేక సర్టిఫికెట్లకే పరిమితమయ్యారని అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ..
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి