ఉత్తరాదిన మంచు ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నుంచి శబరిమల వెళ్లేందుకు అయ్యప్ప స్వాములు గంటల తరబడి స్టేషన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తెల్లవారింది మొదలు పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పొగమంచు తో కమ్ముకుంటున్నాయి. దీంతో రాకపోకలు సన్నగిల్లుతున్నాయి.
న్యూఢిల్లీ నుండి దక్షిణాది రాష్ట్రాలైన హైదరాబాద్, చెన్నై, తిరువనంతపురం, బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 10 నుండి 26 గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Snow
తూర్పుగోదావరి జిల్లా.. రాజానగరం.. జి ఎస్ ఎల్ వద్ద నర్సీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న కర్రల లారీ, లారీని ఓవర్ టెక్ చేసే క్రమంలో పొగమంచు ఉండడంతో అదుపుతప్పి కంటైనర్ ను ఢీకొట్టింది. జాతీయ రహదారిపై కర్రలు అడ్డంగా పడిపోవడంతో.. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను వన్ వే దారి మళ్లించారు. ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read Also..
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్ర పెరుగుతోంది. దానికి తోడు పొగ మంచుతో చల్లగాలులు వీస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే ప్రజలు వణికి పోతున్నారు. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ జిల్లాలో 12.9 డిగ్రీలు, సిరిసిల్లలో 11.8, జగిత్యాలలో 11, పెద్దపల్లిలో 12.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.
Read Also..
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో చలి పంజా విసురుతోంది. గడిచిన గత నాలుగు రోజులుగా ఏజెన్సీ ఉష్ణోగ్రతలు కనిష్టంగా 10 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయం రాత్రి వేళల్లో చలి తీవ్రత చల్లగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏజెన్సీ ఘాట్ రోడ్లు పూర్తిగా పొగ మంచు కప్పేయడంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.





Total views : 77876