నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్‌గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
sports
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
శ్రీలంక క్రికెట్ బోర్డుపై గతంలో విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ తాజాగా ఎత్తివేసింది. క్రికెట్ పాలన వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం నిబంధనలకు విరుద్ధమంటూ గతేడాది నవంబరులో శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. వరల్డ్ కప్ లో టీమిండియా చేతిలో శ్రీలంక జట్టు ఘోర పరాజయం నేపథ్యంలో, లంక క్రికెట్ బోర్డును శ్రీలంక క్రీడల మంత్రి రద్దు చేశారు. అయితే, ప్రభుత్వం క్రికెట్ బోర్డు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం ఐసీసీ రాజ్యాంగానికి విరుద్ధం. ఈ కారణంగానే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించింది. దాంతో, శ్రీలంకలో నిర్వహించాల్సిన అండర్-19 వరల్డ్ కప్ కూడా దక్షిణాఫ్రికా తరలిపోయింది.
భారత ఒలింపిక్ అసోసియేషన్ కొత్త సీఈఓగా రఘురామ్ అయ్యర్ ఎంపికయ్యారు. గతంలో ఆయన రాజస్థాన్ రాయల్స్ సీఈఓగా పనిచేశారు. ఈ మేరకు ఒలింపిక్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా నిర్వహణలో రఘురామ్‌కు విశేష అనుభవం దృష్ట్యా ఆయన ఈ బాధ్యతలకు తగిన వ్యక్తి అని వెల్లడించింది. పలువురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాక రఘురామ్‌ను ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఆయన ఎంపిక ఏకగ్రీవమని కూడా పేర్కొంది. సీఈఓ నియామకంపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ పలుమార్లు గుర్తు చేసిన నేపథ్యంలో రఘురామ్ నియామకం జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌కు సీఈఓగా పని చేసిన రఘురామ్ గతంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇండియన్ సూపర్ లీగ్స్‌లో భాగంగా ఏటీకే మోహన్ బగన్కు, ఆర్పీఎస్జీ మేవరిక్స్ కు సేవలందించారు. కాగా, అయ్యర్ ఎంపికను ఐఓసీ మాజీ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా స్వాగతించారు. అయ్యర్‌కు స్పోర్ట్స్ రంగంపై లోతైన అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రపంచ క్రీడా రంగంలో భారత్ విజయాల దిశగా అయ్యర్ ఎంపిక ఓ కీలక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. కాగా, ఇప్పటివరకూ భారత్ ఒలింపిక్ అసోసియేషన్ సీఈఓ బాధ్యతలను ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు, ఐఓఏ జాయింట్ సెక్రెటరీ నిర్వహించారు.
ప్రతి క్రీడాకారుడికి క్రీడాస్ఫూర్తి ముఖ్యమని.. దీంతోనే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్ లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడలను అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ హై స్కూల్ మైదానం నందు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరిషా పీఎస్, జేసి ఫర్హాన్ అహమ్మద్, ఇండియన్ వాలి బాల్ క్రీడా కారిణి, ఆడుదాం ఆంధ్ర జిల్లా అంబాసిడర్ వసుమతిలు హాజరయ్యరు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదం ఆంధ్రా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలియపరిచారు. అనంతరం జిల్లా అంబాసిడర్ వసుమతి కలెక్టర్ ఎమ్మెల్యేలకు క్రీడా జ్యోతిని అందజేశారు. అనంతరం జాతీయ జెండా ను ఆవిస్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించి బెలూన్లతో పాటు పావురాలను ఎగుర వేసి క్రీడలను ప్రారంబించారు. కబడ్డీ, కో-కో, వాలి బాల్ క్రీడలకు ఏర్పాటు చేసిన మైదానం ను వారు పరిశీలించారు. అనంతరం వాలి బాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని వారితో సరదాగా కాసేపు వాలి బాల్ ఆడారు. ఎమ్మెల్యే, కలెక్టర్, జేసి, జిల్లా అంబాసిడర్ లు కాసేపు వాలి బాల్ క్రీడలను ప్రత్యేక్షంగా చూసి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష యాబై వేలకు పైగా ఆడుదాం ఆంధ్రా లలో ఆడేందుకు క్రీడాకారులు రిజిస్టర్ చేసుకోన్నారన్నారు. యువతలో ప్రతిభను వెలికి తీసేందుకే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తిసుకువచ్చ్చారన్నారు. యువత మన రాయచోటి నుండి ఐపిఎల్ తో పాటు జాతీయ స్థాయిలో ఆడాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం అయిన తర్వాత క్రీడా మైదానం కు 27 ఎకరాలు స్థలాన్ని కేటాయించడమే కాకుండా త్వరితగతిన అన్ని రకాల వసతులతో క్రికెట్ స్టేడియాన్ని పూర్తీ చేసినందుకు కలెక్టర్ గిరిషా పీఎస్ కు ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఆ స్టేడియంలో జాతీయ స్థాయి టోర్నమెంట్ లు జరిగేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడలను యువత, విద్యార్థులు చక్కగా సద్వినియోగం చేసుకోవాలని మన జిల్లా కు మంచి పేరు ప్రఖ్యాతలు తేవలాని మనస్పూర్తిగా కోరుకొంటున్నట్లు ఈ సందర్బంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో రంగ స్వామి, మున్సిపల్ కమీషనర్ గంగ ప్రసాద్, రెవెన్యు అధికారులు, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాష, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, వైకాప నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా.. రాయచోటి.. సూపర్ స్పెషాల్టి హాస్పిటల్ స్థాయిలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతోనే ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి నాయకత్వంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం తుది దశకు చేరుకుందన్నారు, అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ అధ్యక్షులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్. రాయచోటి పట్టణం నందు 23 కోట్లతో తుది దశకు చేరుకున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణంను అసుపత్రి సూపరిటెండెంట్ డేవిడ్ సుకుమార్, సీనియర్ వైద్యులు బండారు కిరణ్ కుమార్, ఇంజనీరింగ్ శాఖ డిఈఈ రాజగోపాల్ రెడ్డి, కాంట్రాక్టర్ కార్తీక్ లతో కలిసి వారు ఆసుపత్రి ప్రాంగణంలో ని రోడ్లను భవన నిర్మాణాలను పరిశీలించి పలు విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వివిధ రకాల వైద్య సదుపాయాల కోసం కేటాయించిన గదుల తో పాటు ఆపరేషన్ థియేటర్, లిఫ్ట్, ల్యాబ్, రిసెప్షన్ లను కూడా పరిశీలించారు. సుమారు 40 లక్షల రూపాయల నిధులతో అదనంగా నిర్మిస్తున్న ఐపిహెచ్ ల్యాబ్ ను, 25 లక్షల నిధులతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి భవనం పనులను నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం రోజున ప్రారంభం చేసి రోగులకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉన్నారన్నారు. అయితే ఇంజినీరింగ్, గుత్తేదారులు ఒక వారం సమయం ఇచ్చినట్లయితే నిర్మాణాలు పూర్తి చేసి అప్పగిస్తామని తమకు తెలియజేసారన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వారి నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాతనే వారి నిర్ణయాన్ని మీకు స్పష్టం తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రోగ్రాం డైరెక్టర్ సాయి, వైకాపా నాయకులు అన్నా సలీం, బేపారి జబి బుల్లా ఖాన్ పాల్గొన్నారు.
రైతు బ్రతికుండగానే డెత్ సర్టిఫకెట్ పుట్టించి భూ మార్పిడి చేసిన రెవెన్యూ అధికారులు.
*ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారులు.
- సంబంధిత తహశీల్దార్ ని CVR NEWS వివరణ కోరగా గ్రామ vro మరియు RI పర్యవేక్షణ చేసిన తర్వాత ఫైల్ నాదగ్గరకు వస్తుంది అంటూ చెపుతున్న తహశీల్దార్.
- VRO ని కాని RI ని కాని కనుక్కోండి అంటూ సమాధానం దాటవేస్తున్న తహశీల్దార్.
- అసలైన రైతులకు అన్యాయం జరుగుతున్నా రైతులు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్న ఏమి పట్టనట్టు ధనార్జనే ద్యేయంగా అధికారులు పనిచేస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న పై అధికారులు.
రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందిస్తామని దానికొరకు గ్రామ సచివాలయాలను తీసుకొచ్చినా చివరికి తహశీల్దారు ఆఫీస్ కు వెళ్లాల్సిందే. అలాంటపుడు సచివాలయాలు ఎందుకు అంటున్నరైతులు. కంబదూరు మండలంలోని కర్తనపర్తి గ్రామానికి చెందిన కురుబ కరెన్న చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ పుట్టించి అతని భూమి నుతిమాడుగు గ్రామానికి చెందిన పింజరి బాబుకు కరెన్నను ఫ్యామిలీ సర్టిఫికెట్ లో పింజరీ బాబును కుటుంబసభ్యునిగా రికార్డు పుట్టించి పింజరి బాబుకు భూమి రాసి ఇచ్చినట్టు రెవెన్యూశాఖ లో ఆన్లైన్ నమోదు ఐనట్టు చూపిస్తున్న అడిగిన వారిని RDO office complaint చేసుకోండని చెపుతున్న అధికారులు ఇదే విషయమై cpi మండల కన్వీనర్ బోయ తిరిపాల్ మీడియా ముఖంగా ఆధారాలతో సహా వెల్లడించారు.
Read Also…
Read Also…




Total views : 89930