మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చెంగిచేర్ల క్రాస్ వద్ద కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని కాంగ్రెస్ నాయకులు చితకబాదారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో చితకబాదిన వ్యక్తి వద్ద తెలంగాణ పోలీసు శాఖలో వరంగల్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ గా అతని వద్ద ఐడి కార్డు లభించింది..
కారులో ఉన్న రెండు బ్యాగులను తీసుకొని మరికొందరు వ్యక్తులు పారిపోయినట్టు కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు. స్థానిక పోలీసులు ప్లేయింగ్ స్క్వాడ్ వచ్చి తనిఖీలు చేయగా అందులో 500,200 రూపాయల నోట్ల కట్టలు లభించాయి. పోచారం మున్సిపాలిటీ, ఘట్ కేసర్ ప్రాంతాలకు తరలిస్తుంన్నారన్న సమాచారంతో కాంగ్రెస్ నాయకులు కారు అడ్డగించి పట్టుకున్నట్లు చెబుతున్నారు. అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ బిజెపి నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డబ్బులు తరలింపు వ్యవహారం వెనకాల మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చేస్తూ చెంగిచెర్ల క్రాస్ హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. కారు వద్దకి చేరుకున్న రిటర్నింగ్ అధికారి. డబ్బు స్వాదీనం చేసుకున్నారు.
telangana elections 2023
గురువారం జరగబోయే ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 638 పోలింగ్ స్టేషన్లో అన్నీ ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలోనే పబ్లిక్ ను అపి పూర్తిగా చెక్ చేసిన అనంతరం పొలింగ్ కేంద్రంలో కి అనుమతి. 3500 మంది పోలీస్ మరియు 5000 మంది పోలింగ్ సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు 80 సంవత్సరాల దాటిన వారికి ఇంటి నుండి ఓటేసి సదుపాయం కూడా కల్పించామని, వృద్దులకు, వికలాంగులకు వీల్ చైర్ లు ఏర్పాటు చేసి వాలింటర్లను సిద్ధం చేశామని ఆయన తెలిపారు.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు.
నవంబర్ 30న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్.మధుమోహన్ అన్నారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్. మధుమోహన్ పత్రికా సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ….. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిస్తుందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పెద్దపల్లి నియోజక వర్గంలో పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ పాటించాలని తెలిపారు.
స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని, హోటల్లలో, ఫంక్షన్ హాల్ లో ఉండి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , సైలెన్స్ పీరియడ్ 48 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సైలెన్స్ పిరియడ్ లో ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, నాయకుల ఇంటర్వ్యూ, ఎన్నికల చర్చలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని, నవంబర్ 29, 30న పత్రికలలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
నవంబర్ 29న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని, అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు.
నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పోలింగ్ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లను తరలిస్తారని, నవంబర్ 30న రాత్రి సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తో కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్లను తరలించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర భద్రత ఏర్పాట్లు చేశామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు.
పెద్దపల్లి లో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని, త్రాగునీటి సౌకర్యం , ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు . పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 575 మంది వృద్దులు, దివ్యాంగుల ఓట్లు ఇంటి నుంచి సేకరించామని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 159 లోకేషన్లలో 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 12 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
శేరిలింగంపల్లి టికెట్ కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీలో నిలపడ్డరు. పరిస్థితుల ప్రభవలతో జగదీశ్వర్ గౌడ్ కి టికెట్ ఇవ్వడం జరిగింది. రఘునాథ్ యాదవ్, జైపాల్ ఇద్దరు అభ్యర్థులు పార్టీ మారకుండా మంచి మనసుతో జగదీశ్వర్ గౌడ్ కి మద్దతు ఇస్తూ ప్రచారం లో పాల్గొనడం సంతోషం కలిగిస్తుంది. శేరిలింగంపల్లి ఎమ్మేల్యే గాంధీ ఇక్కడ చేసింది ఏమీ లేదు. పేరులో గాంధీ ఉన్న చేసే పనులన్నీ దొంగ పనులు గాంధీ ఓ ద్రోహి రేపు జరగబోయే ఎన్నికల్లో శేరిలింగంపల్లి లో కాంగ్రెస్ అభ్యర్థి నే అత్యధిక మెజారిటీ తో గెలిపించాలి. ఈ పదేళ్లు సచివాలయానికి రాని ముఖ్యమంత్రి మనకు అవసరమా..నిరుద్యోగ యువతకు ఈ ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు. ఆయన మనవడిని మంత్రిని చేస్తే లక్కీ నంబర్ 6 ఇంట్లో మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు వచ్చినట్టే అనే ఆశతో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. కేసీఆర్ కు నేను ఓ హామీ ఇస్తున్న తప్పకుండా కేసీఆర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇస్తం. కేసీఆర్ బక్కొడు కాడు భూ బకాసురుడు. అది ఎక్కడో కాదు చర్లపల్లి జైల్ లో ఇస్తాం. కేసీఆర్ చేసిన అవినీతి అంత ఇంత కాదు. బిఆర్ఎస్ ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి నే గెలిపించాలి. మంచి నీ బ్రతికించలి అంటే మంచి అభ్యర్థిని గెలిపించాలి. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాబోతుంది.
పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం వరకు అవకాశం ఉన్నందున వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది (పిఓలు, ఎపిఓలు, పిఓపిలు) 23వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 28వ తేది వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉన్నందున సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భారతి హోలీకేరీ తెలిపారు.
Read Also…
Read Also…
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది. కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు. ఇన్ని రోజులు రాని బాల్క సుమన్ ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని రైతులు నిలదీశారు. 52 సర్వే నెంబర్ లో భూములు అన్యాక్రాంతం అవుతున్నా బాల్క సుమన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్క సుమన్ గో బ్యాక్ అని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. నిరసన తెలుపుతున్న రైతులను సముదాయించి వెళ్లగొట్టిన పోలీసులు. బాల్క సుమన్ బాయ్ బాయ్ మా ఊరికి రావద్దు. మా ఓట్లు నీకు వేయము అంటు గ్రామస్తులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ప్రత్యేక చరిత్ర ఉంది. గతంలో హేమా హేమీలిలు ఈ నియోజకవర్గం నుండి గెలుపొంది ఉన్నత పదవులను అలంకరించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మదన్ మోహన్, ప్రస్తుతం ముఖ్యమంత్రి తెరాస అధినేత కేసిఆర్ ఈ నియోజకవర్గం నుండే ప్రాతినిధ్యం వహించినారు. 2004 లో మొదటిసారి ఎమ్మెల్యేగా తన్నీరు హరీష్ రావు రాజకీయ అరంగ్రేటం చేసి విజయం సాధించారు. అప్పటి నుండి ఎమ్మెల్యే గా హరీష్ రావు అంచెలంచెలుగా తన మెజారిటీ తనే బ్రేక్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. 2019 ఎన్నికల్లో లక్ష పద్దెనిమిది వేల పై చిలుక మెజారిటీతో ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ దక్కకుండా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం హరీష్ రావుకు మరో మారు పట్టం కట్టి భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించిన 9 సంవత్సరాల కాలంలో సిద్దిపేట అభివృద్ధి ఆకాశానికి అంటే విధంగా జరిగింది. నియోజకవర్గం లో రంగనాయక సాగర్ ద్వారా వ్యవసానికి కాల్వల ద్వారా సాగునీటిని అందించడం, మెడికల్ కాలేజ్, సిద్దిపేటకు రైలు తేవడం తో పాటు అనేక అభివృద్ధి పనులు జరిగాయి. జిల్లా ఏర్పాటుతోనే సిద్దిపేట ఎంతో మార్పు చెంది రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన పట్టణముగా రికార్డ్ కు ఎక్కింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు మంత్రి హరీష్ రావు, కేటీఆర్ లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహిస్తూ తమ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా ప్రచారం కొనసాగిస్తున్నారు.సిద్దిపేట నియోజకవర్గంలో నాలుగు మండలాలు, సిద్దిపేట మున్సిపాలిటీలలో అధికార బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండడం, బిఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ మరోవైపు గ్రామ గ్రామాన హరీష్ రావుకు కార్యకర్తల బలం అదనం అసెంబ్లీ ఎన్నికల నగార మోగిన నాటి నుండి నేటి వరకు మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహిస్తుండగా సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారాలు నిర్వహించడం జరుగుతున్న సిద్దిపేట నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్, బిజెపి,బిఎస్ పి పార్టీల అభ్యర్థులు ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి పోటీ కాదని విశ్వాసంతో నాయకులు పనిచేస్తున్నారు. హరీష్ రావు చేసిన అభివృద్ధి పనులు, కార్యకర్తల బలంతో ఈసారి కూడా సిద్దిపేట అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావుకు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు..
Read Also…
Read Also…
ఆమనగల్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజా దీవెన సభలో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నవ నిర్మాణ భారత్ గా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో రాజరిక పాలన నడుస్తుంది. 2017 ముందు యూపీ లో ఇలాగే పాలన ఉండేది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏంతో ఆనందంగా ఉన్నారు. కల్వకుర్తి బిజెపి అభ్యర్థి ఆచారిని గెలిపించాలి. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి దశకు వచ్చింది. రామ మందిరం ప్రారంభోత్సంలో కల్వకుర్తి రామ భక్తులకు దర్శనం చేసుకుని అవకాశం కల్పిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే యూపీ తరహా అభివృద్ధి చేస్తాం.





Total views : 61974