ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
telangana elections 2023
భద్రాది కొత్తగూడెం జిల్లా, ఉదయం 7.00 నుండి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పాల్వంచా లోని అనుబోసే ఇంజినీరింగ్ కళాశాలో ఏర్పాటు చేశారు.
1)పినపాక నియోజకవర్గం 110 :-
మొత్తం ఓట్లు: 1,98,402
పోలైన ఓట్లు: 1,58,978
పోలింగ్ శాతం :80.13%
పోలింగ్ బూత్ ల సంఖ్య : 244
కౌంటింగ్ రౌండ్లు :18
2)ఇల్లందు నియోజకవర్గం 111:-
మొత్తం ఓట్లు: 2,19,569
పోలైన ఓట్లు: 1,76,840
పోలింగ్ బూత్ ల సంఖ్య : 241
పోలింగ్ శాతం :80.54%
కౌంటింగ్ రౌండ్లు:18
3)కొత్తగూడెం నియోజకవర్గం 117:-
మొత్తం ఓట్లు: 2,43,846
పోలైన ఓట్లు: 1,86,347
పోలింగ్ బూత్ ల సంఖ్య : 253
పోలింగ్ శాతం : 76.42%
కౌంటింగ్ రౌండ్లు:19
4)అశ్వారావుపేట నియోజకవర్గం 118:-
మొత్తం ఓట్లు: 1,55,961
పోలైన ఓట్లు: 1,35,501
పోలింగ్ బూత్ ల సంఖ్య : 184
పోలింగ్ శాతం :86.88%
కౌంటింగ్ రౌండ్లు: 14
5)భద్రాచలం నియోజకవర్గం119:-
మొత్తం ఓట్లు: 1,48,661
పోలైన ఓట్లు:1,17,447
పోలింగ్ బూత్ ల సంఖ్య : 176
పోలింగ్ శాతం :79%
కౌంటింగ్ రౌండ్లు: 13
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మొత్తం
పోలింగ్ బూత్ ల సంఖ్య : 1,098
జిల్లా లో పోలింగ్ ప్రదేశాలు : 701
జిల్లా లో సమస్యాత్మక కేంద్రాలు :320
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు:-
మొత్తం ఓట్ల సంఖ్య : 9,66,439.
మొత్తం పోలైన ఓట్లు :7,75,113.
మొత్తం పోలైన ఓట్ల శాతం :80.20%
మొత్తం కౌంటింగ్ రౌండ్లు: 82.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొరకు
బ్యాలెట్ యూనిట్లు:2435
కంట్రోల్ యూనిట్లు :1790
వివిప్యాడ్లు :1777
ఎన్నికల్లో వినియోగించారు..
నేడే ఉత్క్కంటకు తెర, నేడు ప్రజా తీర్పు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం.
నాలుగు జిల్లాలో పది నియోజకవర్గాలు లెక్కింపు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు. 289 పోలింగ్ కేంద్రాలు, 21రౌండ్లు…….!
హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల ఓట్లు అదే కళాశాల భవనంలో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులకు ట్రిపుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు.
నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు..
నల్గొండ జిల్లాలో పోలింగ్ 85.49% నమోదు. నల్లగొండ, నకిరేకల్,మునుగోడు, దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ. నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు :- 84.83 % పోలింగ్ జరిగింది సూర్యాపేట, హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు.. ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు :- భువనగిరి, ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదు. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు… మిగిలిన ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ కు తెరపడింది. 5 గంటల లోపు పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఇచ్చారు అధికారులు. పోలింగ్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయింది. ఇక డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఎన్నికల్లో నిలబడ్డ 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం 3న తేలనుంది. తదుపరి ప్రభుత్వం ఎవరిదో తేలిపోనుంది. ఈ ఎన్నికలు అక్కడక్కడ చిన్నిచిన్న ఘర్షణలు మినహా ప్రశాంతంగా జరిగాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడం నిరాశాజనకమైన విషయంగా చెప్పుకోవచ్చుతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చాయి. అధికార బీఆర్ఎస్ పార్టీకి రెండో స్థానమేనని, కాంగ్రెస్ పార్టీకే ఓటర్ల ఆదరణ లభించిందని ఆయా సర్వేలు వెల్లడించాయి.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ అనుముల మండల ఐటిఐ కాలేజ్ లో జిల్లా కలెక్టర్ ఆర్జీవి కర్ణన్ మాట్లాడుతూ 299 పోలింగ్ స్టేషన్లో సిబ్బంది ఈవీఎం ఏర్పాట్లు చేయడం జరిగింది. వెహికల్స్ కూడా రావడం జరిగింది ఆఫ్టర్ లంచ్ తర్వాత పోలింగ్ స్టేషన్ లో వెళ్లడం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్టర్ అన్ని ఏర్పాట్లు మంచినీళ్లు భోజనం సదుపాయాలు చేయడం జరిగింది. రేపు అతి ముఖ్యమైన రోజు 30 తారీకు పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఓటు వేయాలని కోరుకుంటున్నాను.
రేపటి ఎన్నికల పోలింగ్ కోసం హైదరాబాద్ లో పోలింగ్ ఏర్పాట్లను, డిఆర్ సి సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పరిశీలించారు. గోషామహల్ నియోజక వర్గ డి అర్ సి సెంటర్ కోటి మహిళ కాలేజీ లో బహదూర్ పూర నియోజక వర్గం డి అర్ సి సెంటర్ అరోరా లీగల్ అకాడమీ లో పరిశీలించిన తర్వాత సెక్టార్, అధికారులు పోలింగ్ అధికారులకు సిబ్బంది పాటించ వలసిన ఎన్నికల నిభందనలు వివరించారు. అదే విధంగా ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ నియోజక వర్గాలకు సంబంధించి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డి అర్ సి సెంటర్ పరిశీలించారు. పోలింగ్ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛననీయ సంఘటనలు జరగకుండా పగడ్భందీగా ఏర్పాట్లు చేశామని రోనాల్ట్ రాస్ అన్నారు.
ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్కారు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం భవనం పై భారీ బెలూన్ ను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలతో వినూత్నంగా గ్యాస్ బెలూన్ ను ఏర్పాటు చేశారు. ‘నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను’ అనే నినాదాన్ని ఆ బెలూన్ పై రాశారు. ఈనెల 30న గురువారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు దానిపై పేర్కొన్నారు. భారీ సైజుతో ఎత్తులో ఉన్న ఈ బెలూన్ అందరిని ఆకట్టుకుంటుంది. అలాగే రామగుండం నియోజకవర్గంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల వద్ద ఓటు హక్కు వినియోగించుకోవాలని విషయంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
నిర్మల్ జిల్లా భైంసాలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు FST టీమ్ తో పోలీసులు సోదాలు నిర్వహించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. కార్ల అద్దాలు ద్వంసం గాయాలయ్యాయి. బీజేపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. పలువురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సోదాలు నిర్వహించేందుకు గోడ దూకి ఇంట్లోకి వచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విధులకు ఆటంకం కల్గించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు
వనపర్తి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 296 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. దాదాపు అన్ని చోట్ల లోపల, బయట సి సి కెమెరా లు పెట్టడం జరిగిందని, వాటిని కంట్రోల్ రూం నుండి నియంత్రించడం జరుగుతుందన్నారు. 1587 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసి రూట్ అధికారులు, సెక్టోరియల్ , మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గంలో 271151 ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 135654 మంది మహిళా ఓటర్లు 135491 మంది ఇతరులు 6 మంది ఉన్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో కంటే పోలింగ్ శాతం పెంచేందుకు 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, ఒక పి. డబ్లు.డి, మండలానికి ఒకటి చొప్పున 7 మాడల్ పోలింగ్ కేంద్రాలు, ఒక యువ ఓటర్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని 541 పోలింగ్ కేంద్రాలకు అవసరమైన పోలీస్, రిజర్వు బలగాలు ఏర్పాటు చేయడం, ఎన్నికలు శాంతియుతంగా స్వేచ్చగా జర్పించెందుకు అసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా చేపట్టడం జరిగిందన్నారు. వంద మీటర్ల పరిధి, 200 మీటర్ల పరిధి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కోరారు.





Total views : 61850