బీఆర్ఎస్ పాలనలో 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అక్రమాలకు పాల్పడి రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని మంచి పనులు చేస్తున్నా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్ కు సూచించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. మతతత్వ ప్రచారంతో బీజేపీ లబ్ధి పొందుతోందని చెప్పారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి