ట్రాక్టర్ లీజు (Tractor Lease) :
అమాయక రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు (Tractor Lease) పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్లు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యా రెడ్డి, హాజీపేరా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈ రోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇది చదవండి : వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు 25 వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.
పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్న ఆయన..భుజాలకు సంబంధించిన చికిత్స చేయించుకోనున్నారు. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్న పవన్ కల్యాణ్..ముంబై హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు… - అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్… - దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మొదట ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా సీఈఓ హంగ్ జూ జియోన్,హ్యుందాయ్ మోబిస్ తోనూ…









Total views : 194951