విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా ధ్వంసమయ్యాయి.ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ అనే ఇద్దరు మత్స్యకారులు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదంలో సుమారు రెండున్నర లక్షల రూపాయల విలువైన బోటు, రెండు లక్షల రూపాయల విలువ చేసే చేపల వల పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూశారు.గంగమ్మ తల్లి కటాక్షంతోనే ప్రాణాలతో బయటపడ్డామని తెలిపిన మత్స్యకారులు… తమకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Tag:





Total views : 212191