నగరంలో వరస అగ్ని ప్రమాదం తో ప్రజలు భయభ్రాంతులు. ఫిషింగ్ హార్బర్ గంగలమ్మ గుడి వద్ద ఎగసిపడిన మంటలు. సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాల ఆరా తీసిన పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్. ఫిషింగ్ హార్బర్ వద్ద గాంధీ విగ్రహం వద్ద బడ్డీలు నుంచి ఎగసిపడుతున్న మంటలు. ప్రమాదం పై ఆరా తీస్తున్న విశాఖ పోలీసులు. వరుస అగ్ని సంఘటనలతో భయబ్రాంతులకు గురవుతున్న విశాఖ వాసులు. చేపల వేటకు సంబంధించినవన్ని బూడిద పాలు అయ్యాయని మత్స్యకారులు ఆవేదన. మంటలను అదుపులోకి తీసుకొచ్చిన అగ్నిమాపక శాఖ.
Tag:
vizag fishing harbour fire accident
బ్రేకింగ్ న్యూస్…
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం. దాదాపు 50 కోట్లు పైన అగ్నికి ఆహుతి. కోట్ల విలువ చేసే తమ ఆస్తి కళ్ళముందే బూడిద పాలు అవుతున్న వైనం. విశాఖ పాత నగరంలో అలుముకున్న విషాద ఛాయలు. ఈ ఘటనపై ఆరా తీస్తున్న ఉన్నత స్థాయి అధికారులు. అగ్నిమాపక దళాలు, పోలీస్ ఘటనా స్థలానికి చేరుకుంటున్న వైనం. ప్రమాదంపై ఆరా తీస్తున్న విశాఖ ఉన్నతాధికారులు. జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 40 మెకానిజడ్ బోర్డ్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. మూడు గంటల అగ్నిమాపక సిబ్బంది కృషితో మంటలు అదుపులోనికి వచ్చాయి. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని, తమ కళ్ళముందే అగ్నికి ఆహుతి అయిన బోట్లను చూసి మత్స్యకారులు తీవ్ర మనోవేదనకి గురయ్యారు. ప్రాణ నష్టం లేకుండా మంటలను అదుపులోకి తీసుకు వచ్చామంటున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ రెడ్డి వెల్లడించారు.





Total views : 78439