కాకినాడ జిల్లాలో 18-19 వయసు మధ్య ఉన్న యువతను ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డా కృతికా శుక్లా కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 లోని అంశాలు, ఈ – ఎపిక్ కార్డుల పంపిణీ, ఈవిఎం, వివిప్యాట్ ల ద్వారా ఓటింగ్ విధానం వంటి అంశాలపై రాజకీయ పార్టీ ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఇంకా ఓటర్లుగా నమోదు కాని 18-19 మధ్య వయసున్న యువత ఉన్నారని వారికి అవగాహన కల్పించి ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.
Voter registration
ఈ నెల డిసెంబర్ 9 న కొత్త ఓటరు నమోదు ప్రక్రియ చివరి రోజు గడువు కావడంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బస్టాండ్ సర్కిల్ వద్ద క్యాంప్ నిర్వహించి విద్యార్థులు, అర్హత ఉన్న ప్రజలకి ఓటరు నమోదు పై అవగాహన కల్పించి జనసేన పార్టీ ఐటీ సభ్యుల ద్వారా ఓటు లేని వారికి ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు. అలాగే ప్రజలకి తమ ఓటు ఉందో లేదో పరిశీలించుకునే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజల తలరాతలు నిర్దేశిస్తుందని , ఓటు విలువ అందరూ గ్రహించాలని , అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ డిసెంబర్ 9 వ తేదీ లోపు ఓట్లు నమోదు చేసుకోవాలని, మార్పులు చేర్పులు ఉంటే చేసుకోవాలని ,అలాగే ఓటరు లిస్టులో దొంగ ఓట్లు ఉన్నట్లైతే అభ్యతరలు తెలపాలని, గ్రామ, వార్డు స్థాయిలో జనసేన నాయకులు, జనసైనికులు పరిశీలించి ఈ ప్రక్రియ పూర్తి చెయ్యాలని కోరారు.




Total views : 80188