పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి పంచారామక్షేత్రాల లో ఒక్కటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి కళ్యాణం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. రామకృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని వసతి సౌకర్యాలు కల్పించామని స్వామి వారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్లు ఏర్పాటు చేశామని, భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలతో పాటు చిన్న పిల్లలకు పాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్వామి వారికి ప్రత్యేక పూజలతో రుద్రాభిషేకం, స్వామివార్ల గ్రామోత్సవము, శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి పాంచాహ్నిక దీక్షా కళ్యాణ మహోత్సవము, రధోత్సవము, తెప్పోత్సవము జరుగుతాయన్నారు. భక్తులంతా పాల్గొని శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆశీస్సులు పొందాలన్నారు.
west godavari district news
Tdp :
ఎన్నికలకు టీడీపీ, జనసేన శ్రేణులను సిద్దం చేసేలా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రంగంలోకి దిగుతున్నారు. మొన్నటి వరకు సీట్ల సర్దుబాటు, పోటీ చేసే అభ్యర్దుల వడపోతతో బిజిబిజీగా ఉన్న వారు.. ఇటీవల సంయుక్తంగా పోటీ చేసే స్థానాలను ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలు కలిసి కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అయితే తాడేపల్లిగూడెం లో ఈనెల 28వ తేదీన నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. గతంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా టీడీపీ ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో జనసేన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు చంద్రబాబు అతిధిగా హాజరవుతున్నారు. ఇరు పార్టీల అధినేతలు ఈ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. అన్ని నియోజకవర్గాలలో టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిసి పని చేసేలా సంసిద్దం కావాలని పిలుపునివ్వనున్నారు. జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దగ్గర ఉండి మరీ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇరు పార్టీల నుంచి ఈ సభ విజయవంతం చేసే విధంగా ప్రత్యేకంగా కమిటీలను కూడా ఏర్పాటు చేసి.. అందరూ కలిసి పని చేసే మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో వారికి ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. మంచి నీరు, మజ్జిగ, ఇతర అల్పాహారాన్ని అందించేలా వాలంటీర్లను నియమించారు. “ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా రెండు పార్టీలూ నిర్వహించబోయే ఈ సభకు ‘తెలుగు జన విజయకేతనం.. జెండా’గా నామకరణం చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విజయపు జెండా కావాలని, 28వ తేదీన జరగబోయే సభలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరు పార్టీల అధినేతలు తమ ప్రణాళికను వెల్లడిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన – తెలుగుదేశం పార్టీ పొత్తును మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారని, వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ప్రజలంతా తమకు అండగా ఉంటారని, ఈ ఉమ్మడి సభ రాష్ట్ర రాజకీయాలకు ఒక దిశా నిర్దేశంగా మారబోతుందన్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
ఇక ఈ సభకు లక్షల సంఖ్యలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. సువీశాల ప్రాంగణంలో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నారు. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకని పకడ్పందీగా బారికేడ్ల ను కడుతున్నారు. ఇక స్టేజి దగ్గర నుంచి వెనుక వరకు గ్యాలరీలను నిర్మించి.. అందులో నిర్దేశించిన వారిని మాత్రమే అనుమతిస్తారు. జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు అలాగే వీర మహిళలు, తెలుగు మహిళలు సంయుక్తంగా ఈ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు కూడా పిలుపునిచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇరు పార్టీల నుంచి నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించడం విశేషం. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏర్పడిన పొత్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సంక్షేమం అభివృద్ధి అనే ఉమ్మడి పార్టీల అజెండాను ప్రజలకు అర్థమయ్యేలా ఈ సభలో వివరిస్తామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
జనసేన, టీడీపీ ఉమ్మడి గా జెండా పేరుతో నిర్వహించే ఈ సభ ద్వారా తమ అజెండాను ప్రజలకు వివరించడంతో పాటు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు, జగన్ చేసిన మోసాలు, మాయలను కూడా చంద్రబాబు, పవన్ లు వివరించనున్నారు. ఇక సిద్దం సభల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాుతున్న జగన్ వ్యాఖ్యలకు కూడా తమదైన శైలిలో ఈ జెండా సభ ద్వారా సరైన బదులు చెబుతారని టీడీపీ, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
Read Also…
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తణుకు నుంచే అనేకమంది ఉద్దండలు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు దేశవ్యాప్తంగా పేరుగాంచారు. తణుకు లో 1947లో ఆంధ్రా షుగర్స్- స్వతంత్ర భారతదేశంలో స్థాపించబడిన మొదటి పరిశ్రమ, భారతదేశంలో మొట్టమొదటి ఆస్పిరిన్ ఫ్యాక్టరీ మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు సరఫరా చేసే రాకెట్ ఇంధన యూనిట్ ఇక్కడ ఉండటం తణుకు ప్రత్యేకత.. ఇంత ప్రఖ్యాతగాంచిన తణుకు నియోజకవర్గంలో రాజకీయాలు అదే స్థాయిలో ఉంటాయి. ప్రస్తుతం తణుకు నియోజకవర్గంలో ఎన్నికలు వార్ కొనసాగుతుంది. నియోజకవర్గంలో గెలిచేది నువ్వా నేనా అంటూ అటు వైసిపి ఇటు టిడిపి, గెలుపు గుర్రాల కోసం పరుగులు పెడుతున్నాయి. తణుకు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఆరుసార్లు విజయాన్ని సాధిస్తే కాంగ్రెస్ రెండు సార్లు, వైసిపి ఒక్కొసారి అదికూడా స్పల్పమెజార్టీతో గెలిచింది.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న కారుమూరి నాగేశ్వరరావు 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ తర్వాత వైస్సార్సీపీ లో చేరి 2014లో టిడిపి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ బరిలో ఉన్నారు. ఇప్పటికే కారుమూరి నాగేశ్వరావును వైసీపీ బాస్ జగన్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే జనసేన, టిడిపి కూటమి నేపథ్యంలో ఇప్పటివరకు తణుకు నియోజకవర్గ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న ది ఇంకా స్పష్టత రాలేదు. ఒక పక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధా కృష్ణ టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతుంటే మరో పక్క జనసేన నేత విడివాడ రామచంద్రరావు జనసేన, టీడీపీ కూటమిలో టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ కూడా వైసిపి పాలనను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంటూ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ..ప్రభుత్వ పాలనపై నిత్యం తణుకు ప్రాంతం నుంచి టిడిపి తరపున మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ట ఆద్వర్యంలో ఆందోళణలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ద్వారా సామాన్య ప్రజలకు జరుగుతున్న అన్యాయం అర్ధమయ్యేలా చెప్పడంతో పాటు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో అరిమిల్లిది అందవేసిన చేయిగా మారింది. తణుకులో టిడిపి క్యాడర్ కు ఉన్న కాన్ఫిడెంస్ చూసిని అధినేత చంద్రబాబు అక్కడి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పంటనష్టమయిన రైతులకు పరిహారం ఇవ్వండంటూ చంద్రబాబు సైతం తణుకులో పాదయాత్ర చేపట్టారు. రైతులు నష్టపోయి బాధలో ఉంటే అక్కడి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి మాత్రం రైతులను ఎర్రిపప్పలంటూ సంబోదించడం అప్పట్లో ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఈఘటనతో టిడిపి ప్రజాబలం మరింత పెరిగింది..
రాష్ట్రవ్యాప్తంగా వైసిపి చేస్తున్న అరాచకాలపై తెలుగుదేశంపార్టీ గొంతెత్తడం ఒక ఎత్తయితే మంత్రికారుమూరి నియోజవర్గమైన తణుకులో తెలుగు తమ్ముళ్ళు ఎన్నో కేసులు, ఒత్తిళ్ళు ఎదుర్కొని గళమెత్తడం మరోఎత్తు అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన కూటమి నేపథ్యంలో తణుకు నియోజకవర్గ టికెట్ టిడిపి తరఫునమాజీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణకు ఇస్తారా లేక జనసేన నేత విడివాడ రామచంద్రరావు.. కు ఇస్తారో అన్న సందిగ్ధత ఇక్కడ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.. 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసిన ఆరమిల్లి రాధాకృష్ణ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో టిడిపి తరఫున రాధాకృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు తధ్యమని నియోజకవర్గ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..అసలు తణుకు నియోజకవర్గంలో ఏపార్టీ జెండా ఎగురుతుందో తెలియయ్యాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి.
చంద్రబాబు ఆక్వా రంగానికి చేసింది శూన్యం అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్య శాఖ మంత్రి శిదిరి అప్పలరాజు అన్నారు. నరసాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫీషరిష్ యూనివర్సిటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్య సంపద జగ్రుక్త అభియాన్ వర్క్ షాప్ లో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తూ ఆక్వా రైతులకు లబ్ది చేకూర్చే కార్యక్రమాలు చేశారన్నారు. నరసాపురంకు ఆక్వా యూనివర్సిటీ సాధించిన ఘనత ముదునూరి ప్రసాద్ రాజుకే దక్కిందన్నారు. చంద్రబాబు ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ లను పెట్టింది జగన్మోహన్ రెడ్డి అనడం చాలా హస్యస్పదంగా ఉందన్నారు. ఆక్వా జోన్ లో ఉన్న 10 ఎకరాల లోపు రైతులకు 3 లక్షల 45 వేల ఎకరాలకు ఇచ్చిన మాట ప్రకారం కరెంటు యూనిట్ కి 1.50 పైసలు సబ్సిడీ ఇవ్వడం జరిగిందన్నారు. 3480 కోట్లు ఆక్వా రైతులకు సబ్సిడీ ద్వారా అందించిన దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కొనియాడారు. ప్రతి కనెక్షన్ కి 7 లక్షల రూపాయలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.
Narasapuram :
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రూ 27 కోట్లతో చేపడుతున్న ఏటిగట్టు పనుల్లో మరోసారి డోల్లతనo బయటపడింది. గత నెలలో 100 మీటర్ల మేర గట్టు గోదావరిలోకి కృంగిపోయింది. మళ్లీ చేపట్టిన పనులు కూడా వృధా అయ్యాయి అర్ధరాత్రి కోతకు గురైన చోట వేసిన రాళ్లన్నీ గోదావరిలోకి కృంగిపోయాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2022 గోదావరి వరదకు ఏటిగట్టు సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. ఈ పనులను గత ఏడాది ఏప్రిల్ లో చేపట్టారు. వాడుతున్న రాళ్లు నాసిరకమైన, ప్రభుత్వం తిరస్కరించిన క్వారీ నుంచి రాళ్లు తీసుకొచ్చి పనులు చేపడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు ఆందోళన కూడా చేశారు. ఈ ఫిర్యాదు పై ప్రభుత్వం స్పందించలేదు. అధికారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపడేస్తున్నారు. నీటిలో రాళ్లు గట్టి పడే వరకు ఇలా కృంగితోనే ఉంటుందని దీనికి ఆందోళన చెందనవసరం లేదని చెప్పడం గమనార్హం.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
చలో అమరావతి అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించడానికి వెళ్తున్న అంగన్వాడీలను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేము ఏమి తప్పు చేశామని శాంతియుతంగా వెళ్తున్న మమ్మల్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారని అంగన్వాడీలు మండిపడ్డారు. గత 40 రోజులుగా సమ్మె చేస్తున్న మమ్మల్ని పట్టించుకోని ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మమ్మల్ని అన్యాయంగా రోడ్డుపాలు చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు కూడా వచ్చేలా చేశారని వారు అన్నారు. మాకు వచ్చే 11500 జీతంతో ఏ కుటుంబమైన గడుస్తోందన అని, మమ్మల్ని ఇక్కడ ఆపినంత మాత్రాన ఉద్యమం ఆగదని కచ్చితంగా ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం కబడ్డీ స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో విన్నర్ గా హర్యానా, రన్నర్ గా రాజస్థాన్, మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ జట్టు నిలిచాయి. మహిళా విభాగంలో విన్నర్ గా కలకత్తా, రన్నర్ గా కేరళ మూడు నాలుగు స్థానాల్లో ఆంధ్ర, హిమాచల్ జట్లు నిలిచాయి. ఫైనల్స్ ఆదివారం అర్ధరాత్రి వరకు జరిగాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ షీల్డ్ లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకిరామ్, టిడిపి నాయకులు కోవ్వలి నాయుడు, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వీర లంకయ్యలు అందించారు.
రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు పాలకొల్లు విచ్చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పోడూరు మండలం జిన్నూరు వంతెన వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గజమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు త్రిబుల్ ఆర్ జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు శాలువాతో రఘురామను సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి యతిరాజా నాయుడు, జనసేన ఇన్చార్జి బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్ లో తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన నిరసన దీక్షలు 33వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం తమపై ప్రయోగించిన ఎస్మా 2 కాపీలను దీక్షా శిబిరం వద్ద భోగి మంటలలో తగలబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడి వర్కర్ల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.





Total views : 147115