నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే చిన్న మామిడిపల్లి బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరి ప్రమాదకరంగా తయారైన స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. నిత్యం రైల్వే స్టేషన్ కు చిన్నమామిడిపల్లి, నర్సాపురం, సరిపల్లి, కొప్పర్రు, మత్స్యపురి వైపుగా వేల మంది ప్రయాణికులు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ఉంటారని అటువంటి ఈ బ్రిడ్జ్ పేచ్చులు ఊడి కింద పడిపోవడంతో ఆ రంధ్రంలో ఎవరైనా కాలు పెడితే కాలు విరిగి పోవడం లేదా కాలువలో పడిపోవడం జరుగుతుందని ఇటీవల కాలంలో అనేకమంది ప్రమాదాలకు గురయ్యారని స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అనేక చోట్ల రోడ్ల పరిస్థితి ఏమీ బాగో లేకపోయినా ప్రజలు సర్దుకుపోతున్నారని కనీసం పట్టణంలోని ఈ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఈ పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
west godavari district news
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వద్ద 28 కోట్లతో చేపట్టిన ఏటిగట్టు పనుల్లో డొల్లతనం మూడు నెలల్లోనే బయటపడింది. అమరేశ్వర స్వామి గుడి నుంచి బూడిదల రేవు వరకు చేపట్టిన 100 మీటర్ల ఏటిగట్టు పనుల్లో సుమారు 50 మీటర్లు కొట్టుకుపోయింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి కోతకు గురవుతూ వస్తుంది. గుర్తించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రస్తుతం వరద లేకుండానే గట్టు కోతకు గురి కావడంతో పనులు నాణ్యత పై పొన్నపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనుల తీరుపై ఇటీవల మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు తీవ్రస్థాయి విమర్శలు చేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఈ పనుల్లో బినామీలుగా వ్యవహరిస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. పనుల నాణ్యతలో నాసిరకమైన రాళ్లు వినియోగిస్తున్నారని, ప్రభుత్వం దీనిపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల ఈ రోజు ఏటి గట్టుకు పెద్ద ప్రమాదం వాటిల్లింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రాక్షస పాలనను అంతమొందించడానికి ‘రా కదలిరా’ పేరిట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 7న చంద్రబాబు ఆచంట పర్యటన ఖరారైన నేపథ్యంలో స్థానిక స్వీట్ హోమ్ ఏడు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ, పార్కింగ్, హెలిప్యాడ్లను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం రగిలించడానికి చంద్రబాబు చేపట్టిన బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు నిరుద్యోగ యువత సుమారు 1,30,000 మంది ఈ కార్యక్రమానికి హజరవునున్నారని ముఖ్యంగా దళిత కులానికి చెందిన కుల సంఘాలు కదలి వస్తున్నాయని రాష్ట్ర స్థాయిలోను, ఉభయ గోదావరి జిల్లా స్థాయిలోను ముఖ్యంగా యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని అన్నారు. ఆచంట లో పెద్ద ఎత్తున జరిగే రా కదలిరా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించాలని పిలుపునిచ్చారు. జరగబోయే ఎన్నికలకు ఇది ఒక శంఖారావ సభలా ప్రతి ఒక్కరూ పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. అలాగే జనసేన పార్టీకి చెందిన ఇంచార్జి లు పాల్గొంటారని ఆయన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు ఇన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సీఎం జగన్ కు కనికరం లేకుండా పోయిందని మండిపడ్డారు.
అంగన్వాడీ వర్కర్ల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షిణమే పరిష్కరించాలని టిడిపి నేత కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా టిడిపి నేత కొవ్వలి యతిరజా రామ్మోహన్ నాయుడు దీక్ష శిబిరంను సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, ప్రభుత్వ పథకాలు అందించాలని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను తొలగించి ఆ నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… చింతలపూడి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఉన్నమట్ల ఎలిజా స్థానంలో మరొక అధికారికి అవకాశం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏలూరు ఆర్టీఏ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్న విజయరాజుకు చింతలపూడి ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం జగన్ చింతలపూడి ఎమ్మెల్యే కు నో చెప్పినట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ తో చింతలపూడి టికెట్ తనకే ఇవ్వాలంటూ ప్రాధేయపడినప్పటికీ, చింతలపూడి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ఎలిజాకు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే ఎలిజాను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రతిపాదన చేశారని అయితే తాను చింతలపూడిలోనే పోటీ చేస్తానని ఎంపీగా పోటీ చేయనని అన్నట్లు తెలుస్తుంది. దీనికి తోడు తాజాగా తన అనుచర గణంతో తాడేపల్లిలోని మిథున్ రెడ్డి ఇంటి వద్ద తనకే టిక్కెట్ ఇవ్వాలంటూ తన అనుచరులతో ధర్నాలు చేయించారు. ఒకవేళ వైసీపీ అధిష్టానం తలొగ్గి ఎలిజాకు టికెట్ ఇస్తే ఈసారి తప్పకుండా చింతలపూడిలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందని పార్టీ వర్గాల్లో, ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలిజా ఇప్పటికే దండుగా ప్రజావ్యతిరేకతను మూట కట్టుకున్నారు, ఐప్యాక్ సర్వేలో ఎమ్మెల్యే ఎలిజాకు మైనస్ మార్కులు రావడంతో సీఎం జగన్ ఎమ్మెల్యే ఎలిజానుపక్కన పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
జీఎస్టీ కమిషనర్ ఉద్యోగి గా పనిచేసిన ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా ఉద్యోగాన్ని పక్కన పెట్టి 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. అంతకముందు టీడీపీ కంచు కోటగా చింతలపూడి నియోజకవర్గం ఉండేది. 1983 నుంచి 1999 వరకు ఐదు సార్లు టీడీపీ తరుపున పోటీ చేసిన కోటగిరి విద్యార్ధ రావు గెలుపొందారు. ఆ తరవాత సామాజిక సమీకారణాల నేపథ్యంలో జనరల్ నియోజకవర్గంగా ఉన్న చింతలపూడి ఎస్సి నియోజకవర్గంగా మారింది. 2014 లో మాజీ మంత్రి పీతల సుజాత టీడీపీ తరుపున పోటి చేసి గెలిపోందారు. 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచిన ఎలిజా వలన జరిగిన నియోజక వర్గ అభివృద్ధి దేవుడెరుగు ఎక్కడ రూపాయి వస్తుందో అక్కడికి వాలిపోవడమే కాకుండా ఎమ్మెల్యే గా నాలుగు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు వెనకేసారని నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే దోచుకోవడం దాచుకోవడమే పనిగా పెట్టుకున్న ఎమ్మెల్యే ఎలిజాపై ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఎమ్మెల్యేగా మా గ్రామంలో ఎం అభివృద్ధి చేసావు.. మాకిచ్చిన హామీలు ఎక్కడా అంటూ ప్రజలు నిలదీస్తున్నడంతో తిరిగి ఎమ్మెల్యే ఎలిజాకు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే పరాజయం తప్పదని తెలుసుకున్న పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని నిలబట్టేందుకు వైసీపీ అధిష్టానం కార్యాచరణ రూపొందిస్తే…. టిడిపికి కంచుకోటగా ఉన్న చింతలపూడి నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టిడిపి జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుండట… ఇందులో భాగంగానే ఎన్నారై గా ఉన్న బొమ్మాజీ అనిల్ టిడిపి టికెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతూనే… నియోజకవర్గంలో జరుగుతున్న టిడిపి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ నియోజకవర్గ టిడిపిలో చక్రం తిప్పే నేతల మద్దతు కూడా కూడబెట్టి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అధికార పార్టీపై పోరాడుతూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవల నారా లోకేష్ చేపట్టిన యువగళమ్ పాదయాత్ర చింతలపూడి నియోజకవర్గంలో దాదాపు మూడు రోజులపాటు సాగింది. నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయడంలో కూడా బొమ్మాజీ అనిల్ కృషి చేశారని టిడిపి వర్గాలు కూడా అనిల్ కు ఈసారి టిక్కెట్ ఇస్తే నియోజకవర్గంలో టిడిపికి పూర్వ వైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా టిడిపి టికెట్ కోసం మరో ఎన్నారై సొంగా రోషన్ కుమార్ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత కొంతకాలంగా సొంగ రోషన్ కుమార్ టిడిపిలో పనిచేస్తూ నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇటు నియోజకవర్గంలో టిడిపి చేపట్టే కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ జెండా ఎగరవేస్తానని పార్టీ బాస్ వద్ద టిక్కెట్ కోసం తన ప్రయత్నాలు జరుపుతున్నారు. వీరితో పాటు మాజీ మంత్రి పీతల సుజాత, మరి కొంతమంది ఆసవాహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు తాము జరుపుతున్నారు.
చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి… అక్కడ పాగా వేయాలని చూస్తుంటే… వైసీపీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తూ టిడిపి కంచుకోట ను కైవసం చేసుకునేందుకు ఇటు టిడిపి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. దీంతో చింతలపూడి నియోజకవర్గంలో అటు టిడిపి ఇటు వైసీపీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్తవారు బరిలో నిలుస్తున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడాకారులకు క్రికెట్ కి సంబంధించిన క్రీడ పరికరాలు అందజేయకుండా క్రీడలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రీడ పరికరాలు నాసిరకంగా ఉండటం వల్ల క్రీడాకారులే తమ క్రీడ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం తో పలు విమర్శలు కు తావిస్తున్నాయి. క్రీడలను నిర్వహిస్తున్న అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు.
ఆయుష్ హాస్పిటల్ లో వైద్యుల నిర్లక్ష్యం వల్లే వంగాయ గూడెంకు చెందిన అంజలి అనే వివాహిత మృతి చెందిందని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన చేపట్టారు. గత తొమ్మిది రోజుల క్రితం కడుపు నొప్పితో బాధపడుతున్న అంజలి అనే వివాహితును బంధువులు ఆసుపత్రిలో జాయిన్ చేసారు. ఐసీయూలో బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తుండగా ఆమె మరణించింది. కానీ వైద్యులు డబ్బుల కోసం చికిత్స చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. అసలు ఎం జరుగుతుందా అని బంధువులు వైద్యులను ప్రశ్నించగా వారు ఇంకా చికిత్స చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే ఒకసారి మా అమ్మాయిని చూడాలి అని అడగగా దానికి వైద్యులు నిరాకరించారు. తొమ్మిది రోజుల క్రితమే మృతి చెందిన మహిళకు డబ్బుల కోసం ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం చేసి డబ్బులు దండుకున్నారు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. వైద్య ఖర్చులు పేరుతో లక్షల్లో వసూళ్లు చేసి చివరికి తమ కుమార్తె మృతదేహాన్ని బయటికి పంపారని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో దివ్య ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామి వారి గిరి ప్రదక్షిణ సేవ భక్తులను అలరించింది. గజలక్ష్మి గుర్రాలు గోమాత ముందు నడుస్తుంటే ప్రచార వాహనంపై కొలువు తీరిన స్వామి వారు ఉభయదేవేరులు, కలిసి క్షేత్రపురవీథుల్లో ఊరేగారు. స్వామివారి పాతిక మండపం నుండి ఆలయం చైర్మన్ నివృత రావు, ఈవో వేండ్ర త్రినాథరావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో ప్రచార వాహనం కొలువు తీరిన స్వామివారి అమ్మవారు ప్రత్యేక అలంకరణతో ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వాహనాన్ని ముందు కదిలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోలాట భజనలు కేరళ డప్పులతో శక్తి వేషధారణలతో భక్తులను అలరించారు. వెంకటేశ్వర స్వామి వారి వేషధారణ చేసిన ఇంత ఆకర్షణీయంగా ఉండటం మరో ప్రత్యేకత వివిధ దేవతల అవతారాల రూపంలో వేషాలను వేసి గిరి ప్రదిక్షణలో పాల్గొన్న భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. గిరిప్రదక్షిణ వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు ఆలయ అర్చకులు ప్రత్యేక మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి వారి గిరిప్రదక్షిణ సుమారు 6 కిలోమీటర్లు జరిగింది. ఆలయ తొలిమెట్టు వద్ద పలువురు స్వామి అమ్మవార్లకు హారతులని ఇచ్చారు. అనంతరం క్షేత్రంలో తిరుగాడి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత హారతులు సమర్పించారు. ఈ ఉత్సవం ఆద్యంతం భక్తులను విచిత్ర వేషధారణలు, నృత్యాలు, భజనలు, శక్తి వేషలు వెంకటేశ్వర స్వామి వివిధ దేవుళ్ళ వేషధారణలు ప్రత్యేకముగా విశేషంగా ఆకట్టుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా మారని తాడేపల్లిగూడెం పట్టణం గుణ్ణం ఫంక్షన్ హాల్ రోడ్డులో గల జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల తీరు గత నెల 30న ఒక మైనర్ విద్యార్థినిని చితకబాదిన విషయం మరువకముందే తాజాగా అక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా ఉంటున్న ప్రసన్నలక్ష్మి అనే టీచర్ పిల్లలపై దాడి చేసింది. స్కూల్ యూనిఫాం, క్రమశిక్షణ నెపంతో విచక్షణారహితంగా విద్యార్థులను చావబాదిన ప్రసన్నలక్ష్మి అనే ఉపాధ్యాయురాలు. ప్లెడ్జ్ అనంతరం స్కూల్ యూనిఫామ్ వేసుకుని రాలేదంటూ సుమారు 40 నుండి 50 మంది పిల్లలను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రసన్న లక్ష్మి బెత్తంతో దండించింది. మొన్న ఇదే స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న సూరత్ సాయి తేజేస్వి పై (11) ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని అప్పగించలేదనే నెపంతో స్కూల్ టీచర్ వరుణ్ విచక్షణా రహితంగా చితకబాదడు. దీంతో ఆ విద్యార్థిని ఎడమ బొటన వేలు పై తీవ్ర గాయం కాగా, వీపు పైన, మిగిలిన చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయమై అడిగిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులపై స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ గోపీచంద్ దారుణ పదజాలంతో వారిని దూషించించారు. దీంతో వారు అప్పుడు చైల్డ్ హెల్ప్ లైన్, పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోని విద్యాశాఖాధికారులు. మరలా తాజాగా ప్రసన్న లక్ష్మి అనే అదే స్కూల్ కి చెందిన ఉపాధ్యాయురాలు విద్యార్థులను బెత్తంతో చితకబాదిన సంఘటన చోటుచేసుకుంది. అంతే కాక స్కూల్ యూనిఫామ్ తమ వద్దే తీసుకోవాలంటూ ఆంక్షలు పెడుతూన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణ చేసారు. యూనిఫామ్ ధర సుమారు 2,500 నుండి 8,000 వరకూ ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణం మధ్యలో విద్యార్థులు చదువుకుంటున్నారని, తరగతి గదులు టాయిలెట్ రూమ్స్ పక్కనే ఉండటంతో భరించలేని దుర్వాసన వస్తుందని చెప్పిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారని క్లాస్ రూమ్ లోకి చూడడానికి వెళ్తే లోనికి వెళ్లనివ్వడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు జాయినింగ్ టైంలో స్కూల్ ఫీజులు తక్కువ చెప్పి రెండు నెలల తర్వాత స్కూల్ యాజమాన్యం ఫీజులకు సంబంధించిన యాప్ పెట్టి ఎక్కువ మొత్తంలో ఫీజులు కట్టాలని వేధిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ అధికారులు హెచ్చరించినా జీవి అకాడమీ ఆదిత్యానికేతన్ వారి తీరు ఏమి మారలేదు. విద్యార్థులను చావగొడుతున్న టీచర్ ప్రసన్న లక్ష్మి, పాఠశాల చైర్మన్ గోపీచంద్ ల పై తక్షణమే చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి స్కూల్ గుర్తింపు రద్దు చెయ్యాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
తాడేపల్లిగూడెం పట్టణం యూనియన్ ఆసుపత్రి వద్ద విధుల్లో భాగంగా ఆసుపత్రి విజువల్స్ తీస్తున్న సీవీఆర్ కెమెరామెన్ పై దాడి చేసిన ఆసుపత్రి వర్గాలు ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన ఆసుపత్రి సిబ్బంది. దౌర్జన్యం చెయ్యడమే కాకుండా కెమెరామెన్ వర్ధన్ ను లోపలికి లాక్కెళ్లి బలవంతంగా నిర్బంధించిన యూనియన్ ఆసుపత్రి సిబ్బంది. పోలీసులకు సమాచారం అందించినా ఆగని యూనియన్ ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యం. నిన్న ఒక వ్యక్తి యూనియన్ ఆసుపత్రికి చాతి నొప్పి అని వస్తే అతనికి యంజయోగ్రామ్ చేస్తామని స్టంట్ వేసిన వైనం. ఈ విషయమై వరుస కథనాలు వేసిన సీవీఆర్ న్యూస్ ఈ విషయం జీర్ణించుకొలేని యూనియన్ ఆసుపత్రి సిబ్బంది దాడులకు తెగబడ్డ వైనం యూనియన్ ఆసుపత్రి ఎదుట దాడికి వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టి పేషంట్ల ప్రాణాలతో ఆటలాడటంతో పాటుగా ప్రశ్నించే వారిపై దౌర్జన్యం చేసిన యూనియన్ ఆసుపత్రి యజమాన్యం, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా మిత్రులు డిమాండ్ చేసారు.





Total views : 147206