పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మంత్రి జోగి రమేష్ పర్యటనలో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తో డప్పులు కొట్టించి స్వాగతం పలికించిన స్థానిక నాయకులు పట్టించుకోని అధికారులు. మొగల్తూరు మండలం రామన్న పాలెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కి స్వాగతం పలికెందుకు తీన్మార్ డప్పులు ఏర్పాటు చేసారు వైసీపీ నాయకులు అయితే ఆ డప్పులు కొట్టేవారందరూ విద్యార్థులు కావడం గమనార్హం. 100 రూపాయిలు ఇస్థాము అంటే స్కూల్ మానేసి వచ్చాము అని విద్యార్థులు చెప్పడం గమనార్హం. ఒక మంత్రి చీఫ్ విప్ పర్యటన లో మైనర్లు తో పనులు చేయించకూడదు అని తెలిసినా వారితో డప్పులు కొట్టించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం పలుకుతున్నా కనీసం మంత్రి గాని అధికారులు గాని ఖండించక పోవడం శోచనీయం. మంత్రి జోగి రమేష్ కు కూడా ఉన్న అధికారులుకు గాని మైనార్లు తో పనులు చేయిస్తే శిక్షర్హం అని తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతే కాదు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కి వచ్చిన మంత్రి ని గ్రామాలలో పలు సమస్యలు పరిష్కరించాలని మహిళలు నీలదీయడం మరో విశేషం.
west godavari district news
ప్రజల ఆస్తికి భద్రత లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూహక్కు చట్టం 2023 ను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం న్యాయవాదుల సంఘం నాయకులు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. అసెంబ్లీలో కానీ బార్ అసోసియేషన్ లో కానీ చర్చించకుండా తీసుకువచ్చిన ఒక చీకటి చట్టమని అన్నారు. ప్రభుత్వం ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తూరు నుంచి రేపల్లెకు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్సవాలు…. జనవరి 13 న ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయం బంగారం వెండి మెరుగుల కొరకు మరియు అమ్మవారి విగ్రహానికి రంగుల వేయుట కొరకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్ దర్శనం ఈరోజు నుండి ఆపివేసి తిరిగి ఈనెల 28న ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం మూలవిరాట్ దర్శనాన్ని పునఃప్రారంభిస్తామన్నారు. ఈనెల 27 వరకు అమ్మవారి గర్భాలయం వెనుక ప్రదక్షిణ మండపంలో ఉత్సవ విగ్రహమునకు పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి,ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తలు తెలియచేసినారు..
ప్రైవేటు ల్యాబ్ ల యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఏలూరు నగర ప్రజలే కాకుండా జిల్లాలోని 40 గ్రామాల నుంచి ప్రతీ రోజూ వైద్య సేవలు కోసం రోగులు వస్తుంటారన్నారు. రోగికి వ్యాధి నిర్ధారించే పరీక్షలను ఆసుపత్రిలో ఏళ్ల తరబడి ఉచితంగానే చేస్తున్నారని తెలిపారు. అయితే గత కొంతకాలం నుండి అవుట్ పేషెంట్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రైవేటు ల్యాబ్ లకు రిఫర్ చేస్తున్నారని, ఒక్క ఎమ్మారై స్కానింగ్ కు 5 వేల రూపాయలు వసూలు చేస్తూ 1500 రూపాయల కమిషన్ను రిఫర్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు ముట్ట చెబుతున్నారని తెలిపారు. ఇలా ప్రతిరోజు లక్షల రూపాయలు పేద రోగుల నుంచి కమిషన్ ద్వారా దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరు గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు
మిచాంగ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరసాపురం, మొగల్తూరు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు చేరింది. సముద్రం కల్లోలంగా మారింది కెరటాలు ఎగిసిపడుతున్నాయి. వేట నిషేధించటంతో చేపల బోట్లు తీరానికి చేరుకున్నాయి.
Read Also…
Read Also…
రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. తుఫాన్ ప్రభావం ఉన్నప్పటికీ భక్తులు పెద్దసంఖ్యలోనే ఆలయానికి చేరుకుని శివ నామస్మరణ చేస్తున్నారు. పంచారామ క్షేత్రాల సందర్శనలో భాగంగా దూర ప్రాంతాల నుంచి కూడా పలువురు భక్తులు ఆలయానికి విచ్చేశారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా శివ స్వామీ కి కారంతో అభిషేకాలు చేస్తూ ఉంటారు… ప్రత్యేకించి కార్తీక మాసంలో ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో ప్రత్యేక హోమాలు నిర్వహించి ప్రత్యంగిరి దేవికి ఎంతో ఇష్టమైన 60 కేజీల కారంతో అభిషేక కార్యక్రమాల నిర్వహించారు…ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. శివ స్వామికి కారంతో అభిషేకాలు నిర్వహించారు..
ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు. ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో నెగ్గిన గొల్లపల్లి నరసింహమూర్తి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా వెంటనే ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేయాలని వారన్నారు. అలాగే పార్టీలో ఉండి ఒంటి పోకడ రాజకీయం చేసిన ఘనత ఒక గొల్లపల్లి బుజ్జికే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ అంటూ స్థానిక అధికారులను బాధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఏలేశ్వరం అభివృద్ధి చెందాలంటే ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడమే శుభ పరిణామం అని అది ఏలేశ్వరం మండల ప్రజలకు అదృష్టమని అన్నారు. అలాగే పార్టీలో భవిష్యత్తు ఇచ్చిన ఎమ్మెల్యే పర్వతపై అవాకులు చవాకులు పెలడం తగదని వారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పై ఆరోపణలను మానుకోవాలని వారు సందర్భంగా హెచ్చరించారు





Total views : 147302