తూర్పుగోదావరి జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం గోకవరం లో ఆసక్తికరం గా మారిన వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు. జగ్గంపేట కొత్త ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చాక, స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో కేడర్ లో అసహనం వ్యక్తం చేస్తున్న నేతలు. మరో పక్క నియోజకవర్గం లో రోజు రోజుకు టీడీపీ లోకి పార్టీ కండువాలతో తమ వైపు మార్చుకుంటున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. వైసీపీ ఇంచార్జ్ గా తోట నరసింహం వచ్చినప్పటికీ టీడీపీ లోకి కేడర్ మారిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నామంతున్న నియోజకవర్గ వైసీపీ నేతలు. మరోపక్క ఎమ్మెల్యే గా ఉన్న జ్యోతుల చంటిబాబు కు మళ్ళీ వైసీపీ లో ఇంటిలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ల ద్వారా మళ్ళీ అవకాశాలు ఉన్నాయని వస్తున్న వార్తలతో చంటిబాబు అనుచరుల్లో నూతన ఉత్సాహంగా కలిసి పనిచేస్తామంటున్న స్థానిక నేతలు. నియోజకవర్గ పరిధిలోని మండల కేడర్ నేతలతో ఆత్మీయ సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడంతో అనూహ్య గా మారుతున్న రాజకీయం. చంటిబాబు కు మళ్ళీ అవకాశాలు ఉన్నాయని పుకార్లు తో వైసీపీ లో ఇంచార్జ్ గా ఉన్న నేతల మధ్య, టిడిపి నేతలు మధ్య మొదలైన గుబులు. గోకవరం లో స్థానిక జడ్పీటీసీ దాసరి శ్రీరంగ రమేష్ నివాసం వద్ద తన అనుచరులతో చంటిబాబు వర్గం కార్యకర్తలు తో అత్యవసర భేటి.
YCP leaders
పల్నాడు జిల్లా, నరసరావుపేట లోని ఎస్పీ రవి శంకర్ రెడ్డిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు కలిశారు. అనంతరం ఆంజనేయులు మాట్లాడుతూ.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేశానని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారని అన్నారు.
పల్నాడుజిల్లా నరసరావుపేటలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ఆందోళన చేశారు. కలెక్టర్ కార్యాలయం గేటు వద్ద బైఠాయించిన అంగన్వాడీలు, తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి ఉద్యోగులు వెళ్లకుండా అంగన్వాడిలు గేటు ముందు బైఠాయించారు. ఈ సందర్భంలో అంగన్వాడీ సంఘ నాయకురాలు హెల్డా మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలు రొడ్ఫున పడి సమ్మె చేస్తుంటే, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనపడకపోవడం దారుణం అన్నారు. కనీస వేతనం ప్రకటించే వరకు మేము ధర్నాని ఆపమని అన్నారు. మేము మా సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే, మా వెనుక టీడీపీ నేతలు ఉండి ధర్నా చేపిస్తున్నారని లేనిపోని విమర్శలు వైసీపీ నేతలు అనడం మరింత బాధ కలిగించింది అన్నారు. మేము కనీస వేతనం మాత్రమే ఆడిగాము కానీ, మేము ఏమి గొంతెమ్మ కోర్కెలు అడగలేదు అన్నారు. కనీస పరిజ్ఞానం కూడా లేని ప్రభుత్వ మంత్రులను మా వద్దకు చర్చలకు పంపిస్తున్నారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలి చేశారు అని తెలియజేశారు.
Read Also..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లాది విష్ణుకు సెంట్రల్ నియోజకవర్గం సీటును కేటాయించకపోవడంతో ఒక్కసారిగా భారీ సంఖ్యలో మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న వైసీపీ శ్రేణులు మల్లాది విష్ణు అభిమానులు. ఎట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గం సీటు మల్లాది విష్ణు కు కేటాయించాలని కోరుతూ రోడ్డుపై భారీగా చేరుకున్న ప్రజలు. మల్లాది విష్ణు కే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ భారీ ఎత్తున నినాదాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు మల్లాది అభిమానులు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులకు ఏజెన్సీ నుంచి సకాలంలో జీతాలు రాక ఇబ్బంది పడుతుండడంతో కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే తన దైన శైలిలో స్పందిచారు. జీతాలు పెంచాలన్న తమ డిమాండ్ల సాధనకోసం ఆందోళనలో కూర్చున్న కార్మికులకు తన సొంత నిధులతో ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే మాట విని తిరిగి విధుల్లోకి వచ్చిన కార్మికులకు, నష్టపోయిన నాలుగురోజుల పనిదినాల వేతనాన్ని ఎమ్మెల్యే చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రభుత్వం కార్మికులకు వేతనాలు పెంచేంతవరకు ప్రతినెల మూడు వేల రూపాయలు అదనంగా తన సొంత నిధుల నుంచి చెల్లిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వం కార్మికులకు వేతనం పెంచేంతవరకు తన సహాయం అందిస్తానని, వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి తన ఆర్థిక సహాయం మూడు వేల రూపాయలను అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గతంలో కూడా గోపవరం పంచాయతీ శానిటరీ వర్కర్లు, ప్రొద్దుటూరు మున్సిపాల్ కార్మికులు, జిల్లా ఆస్పత్రిలోని కార్మికులకు ఇదే తరహాలో ఆర్థిక సాయం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. కార్మికుల సమస్య పట్ల న్యాయమైన డిమాండ్ పట్ల తాను సానుకూలంగా ఉన్నానని.. అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెంచడానికి కొంత సమయం పడుతుందన్నారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా వారి డిమాండ్ల పరిష్కారం కావాలని జీతాలు పెరిగి వారు కూడా మిగిలిన వారిలాగే ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో పనిచేసే 43 మంది అవుట్ సోర్సింగ్ పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నాలుగు రోజుల దిన వేతనం మూడు వేలు, అలాగే 39 మంది క్లాప్ డ్రైవర్లకు నాలుగు నెలల వేతనం, ఆందోళన కారణంగా నష్టపోయిన దిన వేతనాన్ని అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. సుమారు 18 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, కమీషనర్ వెంకట రమణ, కౌన్సిలర్లు వరికూటి ఓబుళ రెడ్డి, జిలానీ, కమాల్, నాగరాజు, వైసిపి రాష్ట్ర నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి బయట శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడి బయట వైసీపీకి చెందిన నాయకులు స్పీకర్లనుండి వచ్చిన కీర్తనలకు భజనలు చేపట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ అభిమాన నేత ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తుంటే దానికి మేము ఆందోళన వ్యక్తం చేయగా వైకాపా వాళ్లు పోటీగా పెద్ద శబ్దాలతో దేవుని భజనలు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ, వైకాపా వాళ్లు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేయగా పోలీసులు చేరుకొని ఎటువంటి వివాదాలు రాకుండా సర్ది చెప్పారు.. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ బి అప్పారావులతో పాటు పోలీసు సిబ్బంది వైకాపా, టీడీపీ నాయకులతో కొంతసేపు చర్చలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు జరుపుతున్నామని వైకాపా వారు చెప్పగా దానికి టీడీపీ వాళ్ళు అక్కడే కుడి పక్కకు మార్చాలని పట్టుబట్టారు. కొంతసేపు వాగ్వివాదం వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన్ రంగా 35 వ వర్ధంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం లోని 12వ వార్డు పార్కు రోడ్డు లోని మున్సిపల్ కాంప్లెక్స్ నందు వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొని వంగవీటి మోహన్ రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా ఒక కులానికి నాయకుడు కాదని పేద బడుగు బలహీనవర్గాలకు నాయకుడు అని పేదల కోసం ఆయన చేసిన సేవలు వర్ణించలేని వని అన్నారు. నేటి యువత వంగవీటి ని ఆదర్శంగా తీసుకుని జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు చిట్టూరి కృష్ణ, వై.కే. యస్, పులపర్తి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో వైసిపి – టిడిపి నాయకుల మధ్య ఫ్లెక్సీల రగడ జరిగింది. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టిడిపి – జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. తిరునాళ్లలో పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. అయితే టిడిపి – జనసేన పార్టీలు ఫ్లెక్సీలు తొలగించలేదు. ఈ నేపథ్యంలో అర్దరాత్రి సమయంలో వైసీపీ – టిడిపి నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. వైసిపి నాయకులకు మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు వత్తాసు పలికి ఫ్లెక్సీలను తీయించి వేయడంతో తెలుగుదేశం – జనసేన పార్టీలు వాగ్వాదానికి దిగారు.
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో వైసీపీ నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్న పెదకూరపాడు వైసీపీ బహిష్కరణ నేతలు, ఖండించిన క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి. వైసీపీ పార్టీలో నాయకుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తే వాళ్ళు టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఇంకెంత అవినీతిపరుడో అర్ధం చేసుకోవాలి. పెదకూరపాడు నియోజకవర్గంలో టిడిపికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఇప్పటివరకు ఖరారు కాలేదు. మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గాని, అతని కుమారుడు లోకేష్ గాని, ఎవరు అభ్యర్థిగా వచ్చినా కూడా శంకర్రావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం అని వారు తెగేసి చెప్పారు.
గుంటూరు జిల్లా తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నేతల్లో కలవరం నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజినికి ఇవ్వడంతో గుంటూరు తూర్పు లో మహిళకి సీటు ఇవ్వడం కష్టమేనని చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటికే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే తానే అంటూ ప్రచారంలో దూసుకుపోతుంది ఎమ్మెల్యే ముస్తఫా కూతురు నూరి ఫాతిమా. ఫ్లెక్సీలు ఏర్పటు చేసి తానే ఎమ్మెల్యేనంటూ సమావేశాలను నిర్వహించారు. అయితే చివరి నిమిషంలో సీటు మారే అవకాశం ఉండటంతో కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా రంగంలోకి దిగాడు. తాడేపల్లిలో సీఎం జగన్ ని ముస్తఫా కలిసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.
Read Also..
Read Also..





Total views : 89981