గుంటూరు పట్టణంలో పత్తిపాడు నియోజక వర్గ వైసీపీ నాయకులు సమావేశం, నాయకులు సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ కి కార్యకర్తలే బలం. కార్యకర్తలే లేకుంటే పార్టీలే ఉండవు. నాయకుల మధ్య విభేదాల ఉంటే వాటిని పక్కన పెట్టి గెలుపు కోసం కృషి చేయాలి. గతంలో ఇక్కడ సుచరిత గారిని గెలిపించిన విధంగా ఇంచార్జి కిరణ్ గెలిపించాలని కోరుతున్నా. పార్టీ కోసం గ్రామ గ్రామాన ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు గురించి చెప్పాలి. ప్రభుత్వం బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలో కార్యకర్తలకు గుర్తింపు తెచ్చిన ఘనత వైసీపీ దే అని వెల్లడించారు.
YCP leaders
రాబోయే మూడు నెలల కాలంలో వైసీపీ అరాచక ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం రాబోతోందని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం జవహర్ నగర్ లో కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోల్ స్ట్రాటజిస్ట్ అశోక్ పాల్గొన్నారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు ఏ రకంగా ఓట్లు సాధించాలి, పోల్ మేనేజ్మెంట్ ను ఏ రకంగా మేనేజ్ చేయాలో కార్యకర్తలకు వివరించారు. మార్కాపురంలో వైసీపీ నాయకులు వందల ఎకరాలు ప్రభుత్వ, ప్రైవేటు భూములను దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వైసీపీ నాయకులు దోచుకున్న భూములను రికవరీ చేసి బాధితులకు అందజేస్తామన్నారు.
Read Also..
Read Also..
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు. అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. గ్రామ సచివాలయనికి అడ్డంగా భారీ స్టేజ్ లు ఏర్పాటు చేసి మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరి తెగించారో అర్దం చేసుకోవచ్చు. మహిళల నృత్యాలు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలవచ్చారు.
శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని మంత్రి నగిరి ఎమ్మెల్యే RK రోజా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మరియు శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు మెంబర్లు మంత్రి రోజాకి కుంభ స్వాగతం పలికారు, స్వామి అమ్మవార్ల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీకాళహస్తి శాసనసభ్యులు, YCP నాయకులు లోకేష్ యాదవ్ ఇతర నాయకులు మరియు ఆలయ అధికారులు మంత్రి రోజాకి శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు. కె. గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను మంత్రి వేణు పరిశీలించి అధికారులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు మంత్రి వేణు తరలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. తడిసిన ధాన్యాన్ని
ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి వేణు రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వేణు వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు, వారికి నేను అండగా ఉంటాను. వైస్సార్ కుటుంభంలో ఎలాంటి సమస్యలు ఎదురైన సహించేది లేదు. అందరికి ఒకే ఫెస్ ఉంటుంది, అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నాము. వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం అందరం కృషి చేయాలి.
Read Also…
Read Also…
పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి. జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం, మరో ప్రక్క గజ్జల బ్రమ్మారెడ్డి వర్గం. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వేదికగా వైసీపీ అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. నా వల్ల పదవులు పొంది, నాపైనే ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నరసరావుపేట నుండి నేనె పోటీ చేస్తాను. ఇప్పుడు దాకా నా మంచితనం చుశారు, ఇక నుండి నేనేంటో చూపిస్తాను. ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి అంతే దూరం గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలు పొందుతాను.
పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళల నిర్బంధించారు. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అందులో ఒక వర్గం వైసీపీ నాయకులు కావడంతో మరో వర్గానికి చెందిన మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైసిపి నాయకుడి వర్గం ఫిర్యాదుతో 18 ఏళ్ల యువతిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలను నిర్బందించినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కనీసం మహిళా హోంగార్డు కూడా రక్షణగా లేకుండా రాత్రి అంతా మహిళలను నిర్బంధించడంపై బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Read Also…
ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు, వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు అన్నారు. ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో నెగ్గిన గొల్లపల్లి నరసింహమూర్తి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా వెంటనే ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేయాలని వారన్నారు. అలాగే పార్టీలో ఉండి ఒంటి పోకడ రాజకీయం చేసిన ఘనత ఒక గొల్లపల్లి బుజ్జికే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ అంటూ స్థానిక అధికారులను బాధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఏలేశ్వరం అభివృద్ధి చెందాలంటే ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడమే శుభ పరిణామం అని అది ఏలేశ్వరం మండల ప్రజలకు అదృష్టమని అన్నారు. అలాగే పార్టీలో భవిష్యత్తు ఇచ్చిన ఎమ్మెల్యే పర్వతపై అవాకులు చవాకులు పెలడం తగదని వారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పై ఆరోపణలను మానుకోవాలని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read Also..
ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు. ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాతో నెగ్గిన గొల్లపల్లి నరసింహమూర్తి పార్టీకి రాజీనామా చేయడమే కాకుండా వెంటనే ఎంపీపీ పదవికి కూడా రాజీనామా చేయాలని వారన్నారు. అలాగే పార్టీలో ఉండి ఒంటి పోకడ రాజకీయం చేసిన ఘనత ఒక గొల్లపల్లి బుజ్జికే దక్కుతుందని వారు ఆరోపించారు. ఇదేవిధంగా ప్రోటోకాల్ అంటూ స్థానిక అధికారులను బాధించే సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఏలేశ్వరం అభివృద్ధి చెందాలంటే ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడమే శుభ పరిణామం అని అది ఏలేశ్వరం మండల ప్రజలకు అదృష్టమని అన్నారు. అలాగే పార్టీలో భవిష్యత్తు ఇచ్చిన ఎమ్మెల్యే పర్వతపై అవాకులు చవాకులు పెలడం తగదని వారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పై ఆరోపణలను మానుకోవాలని వారు సందర్భంగా హెచ్చరించారు





Total views : 90003