Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు….

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు….

by Prakash
chandra babu bail news

ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.

Advertisements

You may also like

Our Visitor

014168
Total views : 79375

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.