శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో పులి మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం నుంచి పదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్య హ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ను స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 18 వేల 212 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల సందర్భంగా ప్రలోభాలను, అక్రమాలను అరికట్టడానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, మూడు స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ బృందాలు, ఒక వీడియో సర్వైలెన్స్ బృందం, ఒక అసిస్టెంట్ ఎక్సెండిచర్ అబ్జర్వర్ బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
Karimnagar
బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ విచ్చేశారు. ఈ సందర్భంగా దారి మధ్యలో రేణిగుంట టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని ఆపారు. విస్త్రత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వారికి సహకరించారు.
ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గత శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా ఉన్న ఎల్ సుబ్బరాయుడుని బదిలీ చేయగా వారి స్థానంలో 2011 ఐపిఎస్ బ్యాచ్ కి చెందిన అభిషేక్ మహంతిని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా నియమిస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విధితమే. రాచకొండ ట్రాఫిక్ డీసీపీ గా పనిచేస్తున్న ఆయన బదిలీపై వచ్చి మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కమిషనరేట్ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ అభిషేక్ మహంతి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పాటించాల్సిన నియమాలు మరియు చేయవలసిన విధుల గురించి ఆయన అధికారులకు పలు సూచనలు చేసారు. జిల్లాలో నిస్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని అమలు చేసేలా విధులు నిర్వర్తించాలన్నారు. రౌడీ షీటర్లపై , ఎన్నికల వేళ గొడవలు సృష్టించే వ్యక్తులపై, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘ విద్రోహ శక్తుల పై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వారిని సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలన్నారు. రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిస్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికల నియామాయావళిని అమలు పరచాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద ప్రతీ వాహనాన్ని క్షుణ్ణముగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం తగిన కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also..
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 32వ డివిజన్ కార్పొరేటర్ మర్రి భావన, 38వ డివిజన్ కార్పొరేటర్ కచ్చు రవితోపాటు యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి సతీష్ లను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి సస్పెండ్ చేసింది. తక్షణమే ఈ సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా నాయకులు తమ వ్యవహారశైలిపట్ల వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలో బీజేపీ కి బిగ్ షాక్త గిలింది. మానకొండూర్ బీజేపీ అసెంబ్లీ ఇంచార్జీ గడ్డం నాగరాజు త్వరలో గులాబీ గూటికీ చేరానున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజెపి ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన నాగరాజుకు ఈసారి టికెట్ రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు లోనయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీ పటిష్టత కోసం కష్ట పడిన తనను కాదని కొత్తగా చేరిన అరేపల్లి మోహన్ కి టికెట్ కేటాయించడం పట్ల గడ్డం నాగరాజు గులాబీ గూటికీ చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు బీ ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ.జీవి. రామకృష్ణారావు నాగరాజును మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు. త్వరలో భారీ సంఖ్యలో తమ అనుచరులతో పాటు బీజేపీ కార్యకర్తలతో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీలో చేరనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని సెటైర్ వేశారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారం చేసిన ఘనత రాహుల్ గాంధీదేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు దోచుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదన వింతగా ఉందని మండిపడ్డారు.




Total views : 196357