Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana నరేంద్రమోదీ పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్

నరేంద్రమోదీ పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్

by Satya
Ponnam Prabhakar angry with Narendra Modi

నరేంద్రమోదీ ప్రభుత్వంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లోకి ఇటీవల అగంతుకులు వచ్చి సభ్యులపై టియర్ గ్యాస్ వదిలిన ఘటనపై స్పందిస్తూ ఈ అంశం మన దేశ పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే ఎంపీలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. ఓ బీజేపీ ఎంపీ సిఫార్సు వల్లే నిందితులకు పాస్‌లు వచ్చాయని, వారిని కాపాడేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని పొన్నం ప్రశ్నించారు. పార్లమెంట్ భద్రత అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

You may also like

Our Visitor

013864
Total views : 78223

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.