తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్‌లో ఆయన పరిశ్రమల శాఖపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ అలాట్మెంట్, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ పాలసీలపై సీఎం అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ డిజైన్లు పూర్తిగా పర్యావరణహితంగా, ‘నెట్ జీరో సిటీ’ తరహాలోనే ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక్కడి మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని, ఇందులో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నగరంలో ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు జరపాలని చెప్పారు. వచ్చే జూన్ నెలలోనే ఫ్యూచర్ సిటీ ఇండస్ట్రియల్ పార్క్‌లో పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపనలు జరిగేలా చూడాలని సీఎం టార్గెట్ పెట్టారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, మరియు జర్నలిస్టుల కోసం 500 ఎకరాలను కేటాయించనున్నట్లుగా సీఎం వెల్లడించారు.
MCHRDలో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష…
33
previous post





Total views : 81752