కృష్ణా జలాల కేటాయింపులపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నడుమ పంపకాలపై కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై సమాలోచనలు చేసి.. ప్రస్తుత జలాశయాల్లో ఉన్న నిల్వలు, రెండు రాష్ట్రాల అవసరాలు, ఇప్పటికే జరిగిన వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి కేటాయింపులు ఖరారు చేసింది. మిగిలిన వేసవి కాలానికి సంబంధించి నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి తాగునీటి విడుదలపై ప్రధానంగా చర్చించారు. తాజాగా.. నీటి కేటాయింపులపై కృష్ణా యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకూ కేటాయింపులు జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో తెలంగాణకు నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీలు, శ్రీశైలం నుంచి 4.5 టీఎంసీలు కలిపి మొత్తం 21 టీఎంసీలు, ఏపీకి సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. ప్రస్తుతం వేసవి తీవ్రతను పరిగణలోకి తీసుకున్న బోర్డు.. ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడాలని, సాగునీటికి మళ్లించకూడదని సూచించినట్లు సమాచారం.






Total views : 76668