ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది. అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు. అధికారులను అడిగితే ఎంపీడీఓ లాగిన్ లో పేరు లేదని చెప్పారు. అప్లికేషన్ స్టేటస్ మాత్రం కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉన్నట్టుగా కనిపించింది.దింతో సదరు లబ్ధిదారులు తమకి ఇంటిని మంజూరు చేయాలని కుటుంబంతో కలిసి బిబిపేట నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా బయలుదేరారు. జనగామ గ్రామం వద్దకు రాగానే విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ బాధితుల వద్దకు వెళ్లి వారిని కారులో ఎక్కించుకుని ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడికక్కడే ఇంటి మంజూరు పత్రం రెడీ చేసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయాలని చెప్పి వెళ్లారని బాధితులు తెలిపారు. వెంటనే ఎంపీడీఓ లబ్దిదారురాలికి ఇంటి మంజూరు పత్రం అందజేసి నిర్మాణానికి భూమిపూజ చేసినట్టు తెలిపారు.
ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.
9




Total views : 92161