గుండ్ల పోచంపల్లి డివిజన్ లో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని వస్తున్న ఆరోపణలతో మంగళవారం ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరి తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాల పిల్లల భవిష్యత్తు కోసం గుండ్లపోచంపల్లి శివారులోని 509 సర్వే నంబర్ లో 1991లో 49 ఎకరాల 20 గుంటల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న ఓ వ్యక్తి అధికారం అడ్డం పెట్టుకుని అనేక రకాల చెరువు, కుంటలు ఆక్రమించి భూములు కబ్జా చేసి కళాశాలు నిర్మించుకున్నారని పరోక్షంగా మాజీ మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు.
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
సాధ్యమైనంత తొందరగా ఇక్కడున్న 49.20 ఎకరాల భూమిని సర్వే చేయించి, కార్పొరేషన్ కు అప్పగించాలని స్థానిక కలెక్టర్ ను ఆదేశించారు.
ప్రభుత్వ స్థలాలను, రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు.
గుండ్ల పోచంపల్లి డివిజన్ లో ప్రభుత్వ స్థలం కబ్జా.
417