Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Film తొలి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత..!

తొలి తెలుగు టీవీ న్యూస్‌ రీడర్ శాంతి స్వరూప్‌ కన్నుమూత..!

by Satya
The first Telugu TV newsreader Shanti Swaroop passed away

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్(Telugu TV newsreader) శాంతి స్వరూప్(Shanti Swaroop) కన్నుమూశారు. హైదరాబాద్(Hyderabad) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాంతి స్వరూప్ కన్నుమూశారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానల్ లో ఆయన వార్తలు చదవడం ప్రారంభించారు. టెలీ ప్రాంప్టర్ లేకుండా కేవలం పేపర్ చూసి పదేళ్ల పాటు ఆయన వార్తలు చదివారు.

ఇది చదవండి: ఫ్యామిలీ స్టార్ మూవీ కి క్లీన్ యూ సర్టిఫికెట్…

న్యూస్ రీడర్ గా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 2011లో పదవీ విరమణ పొందేవరకూ శాంతిస్వరూప్ వార్తలు చదువుతూనే ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన "ఎస్ ఆర్ కళ్యాణమండపం" డైరెక్టర్ శ్రీధర్ గాదె, శ్రీ ఐశ్వర్య …
“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.
"15 ఏళ్ల నా కల నెరవేరింది.. నా బిడ్డలా చూసుకున్నా.." 'పంచనామా' ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్ …
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.
హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: