Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు..

by CVR NEWS
తమిళనాడు సీఎం విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు

తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా జీవితాలను అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎక్స్ మీడియా వేదికగా ఆయన హామీ ఇచ్చారు.’తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తిరు సి.జోసెఫ్ విజయ్‌కు అభినందనలు. ఆయన పదవీకాలం అద్భుతంగా సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నా. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం కొనసాగిస్తుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సీఎం విజయ్‌కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే విజయ్‌కు, మంత్రులందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, పారదర్శకమైన, ప్రగతిశీలమైన పాలనను అందించి, రాష్ట్రాన్ని మరింత ప్రగతి వైపునకు నడిపిస్తుందని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ తెలిపారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: