Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Latest News అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..

by CVR NEWS

అగ్నివీర్లకు వివిధ విభాగాల్లో 20 శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ మేరకు లేఖను ముఖ్యమంత్రులకు పంపినట్లు రిటైర్డ్ సైనిక్ సంక్షేమ శాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ మదన్ షీల్ శర్మ తెలిపారు. 2027లో తమ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకునే వారికి ఆయా రాష్ట్రాల్లో ఉపాధి కల్పించాలని హోం మంత్రి లేఖలో సూచించారు. త్రివిధ దళాల్లో పనిచేసిన వారికిచ్చే తరహాలోనే అగ్నివీర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలివ్వాలని, ప్రధానంగా ఫారెస్ట్ గార్డులు, పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్లు, ఫైర్‌మెంట్, ఎస్‌డీఆర్ఎఫ్, మైనింగ్ గార్డులుగా, ప్రత్యేక పోలీసు అధికారులుగా రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే కొన్ని రాష్టాలు, సంస్థలు అగ్నివీర్లకు రిజర్వేషన్ కేటాస్తామని వెల్లడించాయి. ఇందులో హర్యానా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా జైలు వార్డెన్, పోలీస్ సహా ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పోలీసు, ఇతర విభాగాల్లో అగ్నివీర్లకు రిజర్వేషన్లను ప్రకటించింది.

Advertisements

You may also like

Our Visitor

013884
Total views : 78300

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.