పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి. దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు. అందుకోసం వారంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఏప్రిల్16వ తేదీన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నారు. దీంతో కూటమి మహిళ ప్రజాప్రతినిధులంతా లోక్‌సభ గ్యాలరీలో కూర్చొనున్నారు. అలాగే ఏప్రిల్ 17వ తేదీన ఈ బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈ సందర్భంగా రాజ్యసభలోని గ్యాలరీలో వారంతా కూర్చొననున్నారు. దీంతో ఏప్రిల్ 16,17 తేదీల్లో ఏపీలోని కూటమికి చెందిన మహిళా ప్రతినిధులంతా దేశ రాజధాని న్యూఢిల్లీలోనే ఉండనున్నారు. అందుకోసం నేటి సాయంత్రం లోపు అంతా ఢిల్లీ చేరుకోవాలని వారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఏపీలో కూటమిలోని పార్టీలకు చెందిన మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది…
234
previous post