Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshChittoor తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు..

తిరుమలలో వైభవంగా పుష్పాల ఊరేగింపు..

by Rama
pushpa yaga mahosthavam

తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగ మహోత్సవానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు ఆదివారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కల్యాణవేదిక వద్దగల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఈవోఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఉద్యాన‌వ‌న సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి పుష్పయాగాకి శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి నాలుగు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 8 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. శ్రీ‌వారి ఆల‌యంలో పుష్పయాగం సంద‌ర్భంగా ఆదివారం ఉద‌యం రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేశారు. అక్క‌డ స్నపనతిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

019582
Total views : 91174

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.