Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Telangana ఈసారి ఎన్నికల ప్రచారం లో మొత్తం 469.63 కోట్లు సీజ్ …

ఈసారి ఎన్నికల ప్రచారం లో మొత్తం 469.63 కోట్లు సీజ్ …

by Prakash
total money seized in election campaign

ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో క్రితంసారి కన్నా 454శాతం ఎక్కువగా నగదు, బంగారం, మద్యం, డ్రగ్స్, కానుకలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ అంజనీకుమార్​తెలిపారు. ఈ క్రమంలో మొత్తం 11,859 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో సీజ్​చేసిన దానికన్నా ఈసారి 248 శాతం ఎక్కువగా నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక, 559 శాతం అధికంగా మద్యం, 5,472 శాతం అధికంగా బంగారం, వెండి, ప్లాటినం, వజ్రాలు, 5,252 శాతం అధికంగా డ్రగ్స్, 31,440 శాతం అధికంగా కానుకలను సీజ్​చేసినట్టు వివరించారు. స్వాధీనం చేసుకున్న వీటన్నిటి విలువ 469.63 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039444
Total views : 196865

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: