Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshGuntur మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున భోజన వసతి

మత్స్యకారులకు ప్రభుత్వం తరఫున భోజన వసతి

by Rama
cattering

బాపట్ల జిల్లా బాపట్ల మండలం అడవిపల్లి పాలెం గ్రామపంచాయతీలో దాన్వాయిపేట పరిధిలో ఏ ఎం జి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 400 మంది నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున నిన్నటి నుండి అల్పాహారం మరియు భోజన వసతి కల్పిస్తున్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి నిర్వాసితుల క్యాంపును ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్రతీరంలో ఉన్న మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు. సముద్రంలో వేట లేక భోజనం వసతి లేక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులను ప్రభుత్వం తరఫున అల్పాహారం భోజన వసతి కల్పించే బాధ్యత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ ఎండిరా బృందాలు అందరూ పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014285
Total views : 79732

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.