Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం

by Satya
revanth reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన రేపు సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. 1969 – నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో జననం, 2006 – మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్, 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా, 2017లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిక. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం, 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం. 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039612
Total views : 198703

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: