Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra PradeshKadapa రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు..

రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు..

by Rama
GV Praveen Kumar reddy

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు రాజ‌కీయాల్లో టీడీపీ పోస్ట‌ర్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఓ వైపు టీడీపీ టికెట్ వ్య‌వ‌హారంలో అనేక‌మంది ఆశావ‌హులు ఉండ‌గా, ఇంకా పార్టీ అధిష్టానం అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించ‌క ముందే ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పేరున ప్రొద్దుటూరు టీడీపీ అభ్య‌ర్థి అంటూ పోస్ట‌ర్లు ప‌ట్ట‌ణంలో వెలిశాయి. దీంతో జ‌నం ఆ పోస్ట‌ర్ల‌ను ఆస‌క్తిగా చూస్తున్నారు. ప్రొద్దుటూరు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వ‌ర‌ద రాజుల‌రెడ్డి, సీఎం సురేష్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డితోపాటు రాజుపాలెంకు చెందిన శెట్టిప‌ల్లె ప్ర‌భాక‌ర్ రెడ్డి, ప్రొద్దుటూరు మైనార్టీ నాయ‌కులు ఇవి ముక్తియార్ కూడా ఆశిస్తున్నారు. మొన్న‌టి చంద్ర‌బాబు రా క‌ద‌లిరా స‌భ‌కు ముందు రోజు కూడా పార్టీ అధిష్టానం ఐవిఆర్ కాల్ ద్వారా మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌, సీఎం సురేష్ నాయుడు, జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డిల‌లో ఎవ‌రు అభ్య‌ర్థిగా అనుకుంటున్నారంటూ స‌ర్వే కూడా చేసింది. క‌ద‌లి రాస‌భ‌కు భారీ ఎత్తున జ‌నాల‌ను ఇక్క‌డి నేత‌లు ఎవ‌రి స్థాయిలో వారు తీసుకెళ్లారు. ఇటీవ‌ల తిగిరి పార్టీలో చేరిన క‌మ‌లాపురం మాజీ ఎమ్మెల్యే జి.వీర‌శివారెడ్డి జీవి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చార‌ని ప్ర‌క‌టించారు. ఆ మరుస‌టి రోజే టీడీపీ ప్రొద్దుటూరు అభ్య‌ర్థి ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి అంటూ నేరుగా పోస్ట‌ర్ల వెలియడంపై మిగిలిన వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. అయితే పార్టీ అధిష్టానం నుంచి స్ప‌ష్ట‌మైన సంకేతాల‌తో ఇలా ప్ర‌వీణ్ కుమార్ రెడ్డి పోస్ట‌ర్ల రూపంలో అడుగు ముందుకేశాడా లేక త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కంతో పోస్ట‌ర్లు వేయించాడా అన్న‌ది స్ప‌ష్టం కావాల్సి ఉంది. మొత్తానికి రాత్రికి రాత్రికి వెల‌సిన టీడీపీ ఇన్‌చార్జి పోస్ట‌ర్లు ప్రొద్దుటూరులో రాజ‌కీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: