Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Telangana ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు..!

ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు..!

by Satya
Budget meetings

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలను వచ్చే నెల రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చిన అంశాల ప్రాతిపదికన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. రాష్ట్రంలోనూ పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలా? లేదా ‘ఓట్‌ ఆన్‌ అకౌంట్‌’ ప్రవేశపెట్టాలా? అని ప్రభుత్వం ఉన్నతస్థాయిలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై కూలంకషంగా చర్చ జరుగుతుంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలను కనీసం రెండు వారాలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ ప్రవేశపెడితే సమావేశాలు 4-5 రోజులకు మించి ఉండకపోవచ్చని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదల కావచ్చనే ప్రచారం జరుగుతుండడంతో ఆలోపే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దఫా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వాస్తవ రాబడుల ఆధారంగానే బడ్జెట్‌ను రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆ దిశగా అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: