Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. కోర్టు సంచలన తీర్పు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. కోర్టు సంచలన తీర్పు

by Satya
Puri Jagannath and Tarun,

టాలీవుడ్ లో కొన్నాళ్ల కిందట రేగిన డ్రగ్స్ కలకలం తాలూకూ ప్రకంపనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి నమోదు చేసిన ఎనిమిది కేసుల్లో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నెలల తరబడి టాలీవుడ్ ప్రముఖులను విచారించారు. ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టి, నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు కూడా జారీ చేసింది. పూరీ జగన్నాథ్, తరుణ్, చార్మీ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. పలువురు నటులు నుంచి గోర్లు, తల వెంట్రుకలు కూడా సేకరించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. ఈ నేపథ్యంలో, ఫోరెన్సిక్ నివేదిక, సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఆరు కేసుల్లో సరైన ఆధారాలు, సాక్ష్యాలు లేవంటూ కేసులు కొట్టివేసింది. డ్రగ్స్ కేసు విచారణలో సరైన విధానం పాటించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.

Advertisements

You may also like

Our Visitor

014498
Total views : 80394

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.