Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

by Satya
Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ డీఎస్సీ పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,280 ఎస్జీటీ పోస్టులు 1,264 టీజీటీ పోస్టులు 215 పీజీటీ పోస్టులు ఉన్నాయని బొత్స తెలిపారు. 42 ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి కూడా నిర్ణయించామని చెప్పారు. రేపటి నుంచి టెట్ పరీక్షల షెడ్యూల్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఏడు రకాల మేనేజ్ మెంట్ పాఠశాలల పరిధిలో మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని బొత్స తెలిపారు.

Read Also..

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : FacebookInstagram & YouTube.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: