Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Film మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా “నాయక్” రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా “నాయక్” రీ రిలీజ్

by Rama
Naik Movie

మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే (Ram Charan Birthday)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) బర్త్ డే (Birthday) కానుకగా సూపర్ డూపర్ హిట్ చిత్రం “నాయక్ (Nayak)” రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అభిమానులతో పాటు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రీ రిలీజ్ అయితే మళ్ళీ చూడాలని ప్రేక్షకాభిమానులు కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, “మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డేని పురస్కరించుకుని, కాస్త ముందుగా మార్చి 23న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం. ఇందులో రామ్ చరణ్ తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. హీరోయిన్లు కూడా పోటీపడి నటించారు. మిగతా పాత్రధారులు కూడా తమతమ పాత్రలలో ఒదిగిపోయారు. చిత్రంలో అన్ని అంశాలు ఉన్నాయి. కామెడీకి కూడా పెద్ద పీట వేశారు. తమన్ సంగీతాన్ని అందించిన ఏ పాటకు ఆ పాట హైలైట్ గా ఉంటుంది. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఓ ఆకర్షణగా నిలుస్తుంది” అని అన్నారు.

ఇది చదవండి: గ్రాండ్ గా బుల్లెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్…


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014215
Total views : 79565

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.