కడప(Kadapa) జిల్లా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరా రెడ్డి(Nandyala Varada Rajulu Reddy) కామెంట్స్..
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచకపాలన ముగిసిపోయింది, ప్రజలంతా ఆలోచించండి రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారింది. పరిపాలన చేసే సచివాలయాన్ని సైతం కుదవపెట్టేసారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తవ్యక్తి గెలవబోతున్నారు. రాష్ట్రంలో 140సీట్లకు పైగా గెలిచి తెలుగుదేశం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు మంత్రులు సైతం జగన్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఎన్నికలు(elections) సమీపిస్తున్న నేపథ్యంలో వాలంటీర్లకు, కొన్ని సంఘాలకు బహుమతులను ఇస్తున్నారు వైసీపీ నాయకులు. ఇచ్చిన గృహాలకే మళ్ళి పట్టాలను పంపిణీ చేయడం ఎన్నికల వేల కపట నాటకాలే. సాక్షి పత్రికలో ఒక్క తేది తప్ప వార్తల్లో నిజాలు ఉండవు. ఎమ్మెల్యే రాచమల్లు ఆంధ్రజ్యోతి పత్రిక వార్త పై చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదు. సంస్కారం లేకుండా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ వైసీపీ ఉండదని మీ గెలుపుకు సహకరించిన ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి