Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ…

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ…

by Prakash
Judicial inquiry on the Kaleshwaram lift scheme

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందంపై పట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎల్‌ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించనుంది. మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. 100 రోజుల్లో రెండు కమిషన్లు విచారణ పూర్తిచేయాలని కోరింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీగా అవినీతి జరిగిందని, అధికారంలోకి వచ్చాక.. దీనిపై విచారణ జరిపిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు పలు సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సిటింగ్‌ జడ్జిని కేటాయించాలని హైకోర్టుకు సీఎం లేఖ రాయగా, ప్రస్తుత న్యాయమూర్తిని కేటాయించడం వీలు కాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో విశ్రాంత న్యాయమూర్తి వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్తుపై వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకొంది.

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62186

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.