సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, (Somireddy Chandramohan Reddy), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు.
విజయవాడ సింగ్ నగర్ లో సిఎంపై గులకరాయి దాడి ఘటన జరిగిన 4వ నిమిషానికే క్యాట్ బాల్ ఉపయోగించారని సాక్షి, బులుగు మీడియా, జగన్ సోషల్ మీడియాకు ఎలా తెలిసింది? డ్రామా జరిగినప్పుడు చుట్టూ ఉన్నది వైసిపి కార్యకర్తలు, పోలీసులు. మరి నిందితుడిని ఎందుకు పట్టుకోలేక పోయారు? మీరే చేయించుకున్న కుట్ర కాబట్టే నిందితుడిపై దృష్టిసారించలేదు. క్యాట్ బాల్తో దాడి సరిగ్గా కనుబొమ్మపై తగిలేలా కొట్టేంత ఏకలవ్యులు జగన్ జమానాలో ఉన్నారేమో కానీ, వందలాది మంది పోలీసుల మధ్య ఉన్న ముఖ్యమంత్రిని కొట్టడం ఆషామాషీ కాదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
విజయవాడలో సీఎం పర్యటన ఉందని తెలిసినా అదే సమయంలో కరెంట్ ఎందుకు నిలిపివేశారు? ఇది ముందస్తు కుట్రలో భాగం కాదా? జగన్ గారు గొడ్డలి, కోడి కత్తి అయ్యిపోయి ఇప్పుడు క్యాట్ బాల్ డ్రామా మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజాస్పందన కరువయ్యింది. బస్సు యాత్ర తుస్సుమంది. ప్రజా వ్యతిరేకత అర్థమైపోవడం వల్లే ఈ సానుభూతి నాటకం. సాక్షి బులుగు మీడియాలో ఇప్పుడు పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. మీ డ్రామాలను జనం నమ్మే రోజులు పోయాయి. ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మీకు గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. – సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy)
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: క్యాట్ బాల్ వాడారని బ్లూ మీడియా కలగనిందా?