Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Andhra Pradesh మంగళగిరిలో నారా లోకేష్‌దే విజయం..!

మంగళగిరిలో నారా లోకేష్‌దే విజయం..!

by Satya
Nara Lokesh

మంగళగిరి(Mangalagiri)లో నారా లోకేష్‌(Nara Lokesh)దే విజయంలోకేష్‌కు ఫుల్‌ పాజిటివ్‌ సపోర్ట్‌ ఇప్పటికే పలుమార్లు సర్వేలు సర్వే రిపోర్టులన్నింటిలో లోకేష్‌కే పట్టం. ఈ విషయం గ్రహించే ఆళ్ల రాజీనామా ఆళ్ల రామకృష్ణారెడ్డికి పూర్తి వ్యతిరేకత ఆళ్లపై ఆగ్రహంగా మంగళగిరి ఓటర్లు సానుభూతికోసమే ఆళ్ల తాపత్రయమంటున్న జనం క్షేత్రస్థాయిలో లోకేష్‌కే పరిస్థితులు అనుకూలం లోకేష్‌ గెలవడం ఖాయమంటున్న జనం. ఏపీలో మంగళగిరి నియోజకవర్గం హాట్‌ టాపిక్‌గా అవుతోంది. ఈసారి మంగళగిరిలో జెండా పాతేది నారా లోకేషే అన్న విషయం స్పష్టమయ్యింది. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా లోకేష్‌కు ఫుల్‌ సపోర్ట్‌ కనిపిస్తోంది. ఎన్నికల పర్వం మొదలు కాకముందు నుంచే మంగళగిరిలో పలు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. ఇటు అధికార పార్టీ తరపున, అటు.. ప్రతిపక్ష పార్టీ తరపున కూడా ఎవరికి వాళ్లు తరచూ సర్వేలు నిర్వహించారు. అయితే, ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేల్లోనూ లోకేష్‌కే జనం జై కొడుతున్నారు. లోకేష్‌కే పట్టం కట్టారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరోవైపు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి నియోజకవర్గం మొత్తంలో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. రాజధాని ప్రాంతమంటూ ఊరించి.. ఊరించి.. తమ ప్రాంత అభివృద్ధి గురించి చేసిందేమీ లేదని జనం పెదవి విరుస్తున్నారు. పైగా ఎన్నికల్లో గెలవగానే వైసీపీ.. మూడు రాజధానుల పల్లవి అందుకొని అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆళ్లపై జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశాలను ముందుగా గమనించడం వల్లే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేశారని చెప్పుకుంటున్నారు. సానుభూతికోసమే ఆళ్ల.. రాజీడ్రామాలు ఆడారని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న దశలో కూడా నారా లోకేష్‌కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. వెళ్లిన ప్రతిచోటా ఆదరిస్తున్నారు. దీంతో, లోకేష్‌ విజయం ఇక నల్లేరుమీద నడకే అని రాజకీయ విశ్లేషకులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు.


  • నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…
    మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
  • మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..
    హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ…
  • అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..
    ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

009362
Total views : 61981

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.