ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనంలో కొట్టుకుపోయిన వారిలో కాసు మహేశ్ రెడ్డి కూడా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గురజాల అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన కాసు మహేశ్ రెడ్డి… ఓటమిపాలయ్యారు. తాజాగా ఆయన ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.వైసీపీలోని కొందరు నేతలు నోటికొచ్చినట్టు తిట్టి, ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారని కాసు మహేశ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా, టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన కొందరు నేతలు బూతులు తిట్టారని, పైగా చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని… అలాంటి అవమానాలు చంద్రబాబులోనూ, టీడీపీ నేతల్లోనూ కసి పెంచాయని అన్నారు.ఎవరినైనా అవమానాలకు గురిచేస్తే వారు కసితో రగిలిపోయి విజయం సాధిస్తారని చరిత్ర చెబుతోందని, ఈ ఎన్నికల్లో చంద్రబాబు విషయంలో జరిగిందే అదేనని కాసు మహేశ్ రెడ్డి స్పష్టం చేశారు.తమ పార్టీ ఓటమికి కారణాలు పై విశ్లేషించిన గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు రామాయణ, మహాభారత పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయని, జగన్ కూడా ఇప్పుడు అదే కసితో పనిచేయాలని అన్నారు.తక్కువ స్థాయి మద్యం బ్రాండ్లు కూడా వైసీపీ ఓటమికి దారితీశాయని, మద్యం తాగేవారు తమ పార్టీకి ఓటేయలేదని చెప్పారు. రాష్ట్రంలో మద్యం పాలసీ మార్చాలని సజ్జలకు, విజయసాయిరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని వివరించారు.రాష్ట్రంలో పాతికశాతం మందుబాబులు ఉంటారని, వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారని తెలిపారు. నాసిరకం మద్యాన్ని అధిక ధరలకుఅమ్ముతున్నారని టీడీపీ చేసినప్రచారంమందబాబులపై బాగా ప్రభావం చూపిందని పేర్కొన్నారు.ఇసుక విధానం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పేదలపైనా, ఇతర వర్గాల ప్రజలపైనా ప్రభావం చూపాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.అమెరికాలో హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న అక్రమాలపై ట్రంప్ ప్రభుత్వం భారీ దర్యాప్తు చేపట్టింది. అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి’ఎస్పోసిటో వెల్లడించిన వివరాల ప్రకారం.. వీసా మోసాలపై ఇప్పటికే డజన్ల కొద్దీ సమ్మన్లు, సబ్‌పోనాలు…
- అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, హోటల్స్, విద్యా సంస్థలతో రూపుదిద్దుకుంటున్న రాజధాని ప్రాంతానికి ఇప్పుడు హైటెక్ స్కై కనెక్టివిటీ కూడా అందుబాటులోకి రానుంది. ఉండవల్లి సమీపంలో ఆధునిక సదుపాయాలతో హెలిపోర్ట్…
- భారత్-ఆస్ట్రేలియా సీఈఓలతో ప్రధాని మోదీ కీలక భేటీ.భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో కలిసి ఇరు దేశాల ప్రముఖ సీఈఓలు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల…
- చెన్నై ఎగ్మూర్‌లోని ఆస్పత్రుల్లో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు.తమిళనాడు సీఎం విజయ్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అవినీతి లేని పాలన అందిస్తానని చెబుతున్న విజయ్..ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆధారాలతో సహా అవినీతి అధికారుల సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి..తాజాగా ప్రభుత్వాస్పత్రుల్లో ఆకస్మిక…
- ఇరాన్‌పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 194382