నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 3 కోట్ల 98 లక్షల 34 వేల 583 రూపాయల నగదు రాబడిగా లభించిందని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 28 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్టు. ఆలయ అధికారులు వెల్లడించారు ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 148 గ్రాముల బంగారం అలానే వెండి 6 కేజీల 260 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు 835 యుఎస్ఏ డాలర్లు,2 ఖత్తార్ రియాల్,55 యుఏఈ దిర్హమ్స్,105 కెనడా డాలర్లు,35 ఆస్ట్రేలియా డాలర్లు,106 మలేషియా రింగిట్స్,2 సింగపూర్ డాలర్లు, సౌదీ అరేబియా రియాల్స్ 20, థాయిలాండ్ బాట్స్ 80, యూరోలు 30 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ లెక్కింపులో లభించాయని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో పెద్దిరాజు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి